నాపై ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు ఇస్తా: వైఎస్ షర్మిల విమర్శలకు ఆళ్ల కౌంటర్

Published : Sep 14, 2022, 02:50 PM IST
నాపై ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు ఇస్తా: వైఎస్ షర్మిల విమర్శలకు ఆళ్ల కౌంటర్

సారాంశం

తనకు ఆస్తులున్నాయని వైఎస్ సర్మిల చేసిన ఆరోపణలను దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు. ఈ ఆస్తులు తనవని నిరూపిస్తే వెంటనే పేదలకు రాసిస్తానని ఆయన స్పష్టం చేశారు.   

మహబూబ్ నగర్: తనపై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలను నిరూపించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కాకముందు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డికి అప్పులుండేవన్నారు.ఎమ్మెల్యేల అయిన తర్వాత వెంకటేశ్వర్ రెడ్డికి  ఆస్తులు ఎక్కడినుండి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు  ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు.

ఈ విషయాలపై ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి స్పందించారు. వైఎస్ షర్మిల ఆరోపించినట్టుగా ఆస్తులుంటే వాటిని పేదలకు రాసిస్తానని వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు.వ్యక్తిగత దూషణలకు కూడ హద్దు ఉంటుందన్నారు.షర్మిల చేసిన విమర్శలపై ఓపిక పట్టినట్టుగా ఆయన చెప్పారు. షర్మిల విమర్శలు తట్టుకోలేక స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు. 

జగనన్న వదిలిన బాణమా, బీజేపీ వదిలిన బాణమా చెప్పాలని ఆయన షర్మిలను ప్రశ్నించారు. మీ అన్నకు, ీను గొడవలుంటే అక్కడే తేల్చుకోకుండా తెలంగాణలో ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారు. పదవులు, ఆస్తులు రాకపోతే అన్నను అడగాల్సింది పోయి తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుందని షర్మిలపై వెంకటేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. 

also read:స్పీకర్ చర్యలు తీసుకొంటే న్యాయపరంగా వెళ్తాం: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అభివృద్ది జరగలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ది పథంలో సాగుతుందన్నారు. గతంలో ప్రాజెక్టులు నత్తనకడకన సాగాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై సాగు తాగు నీరు అందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?