బ్యాంకు రుణం ఎగవేత: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష

Published : Sep 14, 2022, 01:18 PM ISTUpdated : Sep 14, 2022, 02:25 PM IST
బ్యాంకు రుణం ఎగవేత: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష

సారాంశం

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి అప్పు తీసుకొని చెల్లించనందుకు ఆమెను అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను బుధవారం నాడు అరెస్ట్ చేశారు.  నిన్న రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు రూ,. 52 లక్షలు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించలేనందున బ్యాంకు అధికారులు  గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగుళూరుకు సీబీఐ అధికారులు తరలించారని ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణం తీసుకుని ఎగవేసిన విషయమై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేసింది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావుపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి చార్జీషీట్ దాఖలు చేశారు.  చార్జీషీట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు  హైద్రాబాద్ కు చెందిన నేషనల్ బ్యాంక్ మిడ్ కార్పోరేషన్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అప్పటి బ్రాంచ్ మేనేజన్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది.  బ్యాంకు నుండి రుణం పొందేందుకు  నిందితులు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని  చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. వాస్తవాలను అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు వాస్తవాలను దాచారని సీబీఐ ఆరోపించారు. బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా చార్జీషీట్ లో సీబీఐ పేర్కొంది. 

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో సీబీఐ కోర్టు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు ఈ కేసులో నిందితులకు శిక్ష విధించింది. కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త పి. రామకోటేశ్వరరావు,  , బ్యాంకు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. లక్ష చొప్పున జరిమానాలను కూడా కోర్టు విధించింది. కోర్టు ఆదేశాలతోనే సీబీఐ అధికారులు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత సహ నిందితులను అరెస్ట్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్స్  టీవీ9,  ఏబీఎన్  లు  కథనాలు ప్రసారం చేశాయి. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu