
దళిత బంధు పథకం అమలో మరో ముందడగు పడింది. దళిత బంధు పథకం కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మరో నాలుగు మండలాలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా మండలాలు ఉన్న జిల్లాలకు రూ.250 కోట్ల నిధులను సమకూర్చింది. ఆయా కలెక్టర్ల ఖాతాలో ఎస్సీ కార్పొరేషన్ మంగళవారం ఆ నిధులను విడుదల చేసింది. దీంతో ఆయా మండలాల్లో కూడా ఇప్పుడు దళితబంధు అమలుకానుంది.
భర్తను విందుకు పిలిచి.. తాగించి, కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టి.. ఓ భార్య దారుణం...
విమర్శల నేపథ్యంలో...
దళితబంధు పథకంపై వచ్చినన్ని విమర్శలు దేనిపైనా రాలేదు. దీనికి కారణాలు ఉన్నాయి. సరిగ్గా హుజూరాబాద్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రకటించింది. అది కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ కొత్త పథకం ప్రారంభించినా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ప్రారంభిస్తుందని, గతంలో కూడా హుజూరాబాద్ నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఇది ఒక సంప్రాదయంగా వస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఈ పథకం కూడా హుజూరాబాద్ లోనే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. హుజురాబాద్‌లో 50 వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్నాయని, వారి ఓట్ల కోసమే అక్కడ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే దళితబంధు పథకం తెరమీదకు తెచ్చారని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. దీనిని అధికార పార్టీ కూడా ఎదుర్కొంది. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పింది. కానీ దీనిపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగడం, ప్రతిపక్షాల ఇది ఆయుధంగా మారే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పెద్దలు కొంత ఆలోచనలో పడ్డారు. ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు మరో నాలుగు నియోజకవర్గాల్లోని ఒక్కో మండలంలో కూడా దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తుంగతుర్తి, మధిర, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని ఓ మండలంలో అమలు చేయనున్నట్టు తెలిపారు.దీని కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణను వణికిస్తున్న చలి.. హైదరాబాద్‌లో టెంపరేచర్ సింగిల్ డిజిట్‌కు.. ఇంకా ఎన్ని రోజులంటే..!
ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో..
కొత్తగా దళితబంధు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఎన్నికల కోడ్ ఉండటంతో ఆ పథకాన్ని అమలు చేయలేదు. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా దళితబంధు అమలు చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాలు ఉండే జిల్లాలైన సూర్యాపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్ల ఖాతాలో ఈ నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ముందుగానే నిర్దేశించిన మండలాలైన తుంగతుర్తి, చింతకాని, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దళితబంధు పథకం అమలు చేయడం ద్వారా దళితుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా వివక్షను ఎదుర్కొంటున్న దళిత కుటుంబాలకు ఆర్థిక స్వాలంభన చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలిపారు.