భర్తను విందుకు పిలిచి.. తాగించి, కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టి.. ఓ భార్య దారుణం...

Published : Dec 22, 2021, 08:48 AM IST
భర్తను విందుకు పిలిచి.. తాగించి, కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టి.. ఓ భార్య దారుణం...

సారాంశం

కేసును లోతుగా దర్యాప్తు చేయగా అతని భార్య నేనావత్ బుజ్జిబాయి మీద అనుమానం వ్యక్తం కావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. భర్తను పథకం ప్రకారం హత్య చేసిందని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె తన మేనమామ కుమారుడు పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ కు దగ్గరై సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

గాంధారి :  రాంపూర్ గడ్డ సంగెం రేవు శివారులో ఈనెల 14న గుర్తు తెలియని వ్యక్తి dead body లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. మృతుడు nizamabad జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లి ఫారానికి చెందిన కాశీనాథ్ (39)గా గుర్తించారు. ఆయన భార్య, తన భర్త కాశీనాథ్ ఈ నెల 8 నుంచి కనిపించడం లేదని బీర్కూర్ ఠాణాలో ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు.

కేసును లోతుగా దర్యాప్తు చేయగా అతని భార్య నేనావత్ బుజ్జిబాయి మీద అనుమానం వ్యక్తం కావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. భర్తను పథకం ప్రకారం హత్య చేసిందని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె తన మేనమామ కుమారుడు పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ కు దగ్గరై సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

శ్రీనివాస్  చిన్న కుమారుడు సురేష్ తో కాశీనాథ్ కు విందు ఇస్తామని చెప్పి.. మద్యం తాగించి.. కట్టెలతో కొట్టి చంపి.. మట్టిలో పాతి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న బుజ్జి బాయి, సురేష్ ను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ చెప్పారు.  శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

భార్యాభర్తల గొడవ.. కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. ఒకరి హత్య, ముగ్గురికి గాయాలు...

ఇదిలా ఉండగా, wife and husband గొడవ రెండు కుటుంబాల మధ్యకత్తులు దూసుకునే వరకు వెళ్ళింది.  ఈ దాడి  ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యేలా చేసింది. ఈ ఘటన Nalgonda District నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ లో మంగళవారం జరిగింది.  పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..  బొక్కమంతలపహాడ్ కు చెందిన కమతం బిక్షమయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడు శివ నారాయణకు అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె శ్యామలతో ఐదేళ్ల కిందట వివాహమయ్యింది.

వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శివ నారాయణ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చి.. వారికి ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వివాహమైన ఏడాది నుంచే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో గ్రామ పెద్దలు వీరిద్దరికీ సర్థిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా.. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం శ్యామల తల్లిగారింటికి ఫోన్ చేసి చెప్పింది. 

తరచూ conflicts నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్యామల తండ్రి సూర్య నారాయణ, తల్లి యశోద, అన్న శివ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో శివ నారాయణ ఇంటికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న red chilli powderని ఇంట్లో ఉన్న శివ నారాయణ, అతని తండ్రి బిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్లల్లో కొట్టారు. knivesతో దాడి చేసి పరారయ్యారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అచ్చమ్మ (60) అక్కడికక్కడే చనిపోయింది. వీరి కేకలతో అప్రమత్తమైన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు.  తీవ్రంగా  గాయపడిన ముగ్గురిని మిర్యాలగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మిర్యాలగూడ ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తి మాధవి క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu