కావాల‌నే ఇరికించారు.. ఇది అక్ర‌మ అరెస్టు.. రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

By Mahesh Rajamoni  |  First Published Mar 16, 2024, 11:47 AM IST

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. రౌస్‌ అవెన్యూ కోర్టులోకి వెళ్తున్న క్ర‌మంలో క‌విత మాట్లాడుతూ 'త‌న‌ది అక్రమ అరెస్టు' అంటూ కామెంట్ చేశారు. 
 


Delhi Liquor Scam - Kavitha: ఢిల్లీ మ‌ద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవితను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని త‌న నివాస ప్రాంగణంలో గంటల తరబడి సోదాలు నిర్వహించిన త‌ర్వాత క‌విత‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలోకి తీసుకురాగా, రాత్రికి అక్కడే బస చేశార‌ని ఈడీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

శ‌నివారం ఈడీ అధికారులు క‌విత‌ను కోర్టు ముందు హాజ‌రు ప‌రిచారు. రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ క‌విత‌ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడుతూ త‌న‌ది అక్ర‌మ అరెస్టుగా పేర్కొన్నారు. కోర్టులో దీని కోసం న్యాయ పోరాటం చేస్తామ‌ని తెలిపారు. కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని ఆమె పేర్కొన్నారు. ఈడీ అధికారులు క‌విత‌ను క‌స్ట‌డీ కోసం కోర‌నున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 రోజుల కస్టడీ కోరింది. 
గెలుపే ల‌క్ష్యం.. నాగర్​కర్నూల్ లో మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం..

Latest Videos

click me!