ఈ చైన్ స్నాచర్ రూటే సపరేటు.. విమానాల్లో వచ్చి గొలుసు దొంగతనాలు.. ఆరోసారికి పట్టుకున్న పోలీసులు...

Published : Mar 31, 2022, 10:51 AM IST
ఈ చైన్ స్నాచర్ రూటే సపరేటు.. విమానాల్లో వచ్చి గొలుసు దొంగతనాలు.. ఆరోసారికి పట్టుకున్న పోలీసులు...

సారాంశం

ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానుపోను విమాన టికెట్లు బుక్ చేసుకుంటాడు. ఏదో పెద్ద వ్యాపారపనిమీద వచ్చినట్టుగా హైదరాబాద్ వచ్చి.. ఇక్కడ చైన్ స్నాచింగ్ లు చేసుకుని ఎంచక్కా విమానం ఎక్కి వెళ్లిపోతాడు. ఈ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : Chain snatchers అనగానే స్థానికంగా ఉంటూ.. వచ్చిపోయే వారి కదలికలు గమనిస్తూ.. ఎక్కువగా వాకింగ్ కు వెళ్లే లేడీస్ ని, వృద్ధులను టార్గెట్ చేస్తారని కామన్ గా అనుకుంటాం. అయితే ఈ చైన్ స్నాచర్ రూటే సపరేటు.. ఏకంగా Flightల్లో వచ్చి మరీ చైన్ స్నాచింగ్ లు చేసి వెళ్లిపోతుంటాడు.

అలా, Two wheeler మీద వెళుతున్న దంపతులను  బైక్ మీద వెంబడించి Woman మెడలోని గొలుసు తెంచుకుని విమానంలో పారిపోవడానికి ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. గొలుసు లాక్కునే క్రమంలో మహిళ వాహనంపై పడి గాయాలపాలైనా అతను కటువుగా వ్యవహరించాడు.  మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసం స్వామి కథనం ప్రకారం..  యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెంది తూపల్లి నరసింహ రెడ్డి కుటుంబం నగరంలోని హస్తినాపురం అనుపమ నగర్ కాలనీలో ఉంటున్నారు.  

4 రోజుల క్రితం  నరసింహారెడ్డి (65), భార్య కమల (55)తో కలిసి బ్రాహ్మణపల్లి వెళ్లారు. మంగళవారం సాయంత్రం బైక్పై తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద హైవే పై ఓ దుండగుడు బైక్ మీద వెనకనుంచి వచ్చి కమల మెడలోని   పుస్తెలతాడు తెంచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.  కొంత దూరం వెళ్ళిన నిందితుడు తిరిగి వచ్చి కమల మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడు తెంచుకొని నగరం వైపు పరారయ్యాడు. నరసింహారెడ్డి దొంగను కొంతదూరం వెంబడించినా ఫలితం లేకపోయింది.  గాయపడిన  కమలను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  

బాధితుడి ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వేగంగా స్పందించి హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.  లభించిన సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు  ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ చన్వర్ గేట్లో నివసించే హేమంత్ గుప్తా (24)గా గుర్తించారు. గాజుల దుకాణంలో పనిచేసే అతను తాను ఎంచుకున్న ప్రాంతానికి విమాన టికెట్లు బుక్ చేసుకుని గొలుసుల చోరీలు చేసి వెళ్తుంటాడు. ఇలా ఆరుసార్లు తప్పించుకున్నాడు.  ఏడోసారి తప్పించుకుని విమానంలో పారిపోతుండగా, బుధవారం  అబ్దుల్లాపూర్మెట్, విమానాశ్రయ, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. పుస్తెలతాడుతో పాటు బైక్ ను  కూడా స్వాధీనం చేసుకున్నారు. 

అయితే, హేమంత్‌ గత కొన్ని నెలలుగా కనీసం ఆరుసార్లు హైదరాబాద్‌కు ఇలా వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉదయం విమానంలో రావడం.. బైక్ అద్దెకు తీసుకోవడం.. గొలుసులు తెంచుకుని.. పనికాగానే మళ్లీ రిటర్న ఫ్టైట్ లో వెళ్లిపోవడం.. ఇది అతని షెడ్యూల్. దీనివల్ల నిందితుడిని పట్టుకోలేరు. ఈ సారి మాత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. హేమంత్‌ బైక్‌కు సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలను గుర్తించారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అతడు ఈ-క్లాసిఫైడ్ పోర్టల్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పోలీసులు పోర్టల్ నుండి హేమంత్ ఫోన్ నంబర్‌ను సేకరించారు. ఆ తరువాత అతని ఫోన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో ట్రేస్ చేశారు.

వెంటనేఅబ్దుల్లాపూర్‌మెంట్ పోలీసులు విమానాశ్రయ పోలీసు అవుట్‌పోస్ట్ బృందం, విమానాశ్రయ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వీరితో కలిసి, అన్ని విమానాల ప్రయాణీకుల వివరాలను శోధించి, ఉదయం 5.45 గంటలకు హేమంత్‌ను అరెస్టు చేశారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు అప్పగించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ