ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడును పెంచింది. ఇవాళ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేస్తున్నారు. దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం నాడు సోదాలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.లిక్కర్ స్కాం విషయమై ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 25 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని గచ్చిబౌలి జయభేరి అపార్ట్ మెంట్ లోని ఒకరి నివాసంతో పాటు అరుణ్ రామచంద్రపిళ్లై నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరులో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ స్కాం విషయమై ఈ నెల 6, 7 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల పాటు నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన సీబీఐ అధికారులు కేసు సమోదు చేశారు.ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న అరున్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ చేర్చించింది. ఈ నెల 6,7 తేదీల్లో రామచంద్రన్ పిళ్లైకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు.
undefined
హైద్రాబాద్ లోని రాబిన్ డిస్ట్రిలరీస్ కు చెందిన సంస్థతో పాటు ఈ సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో గతంలోనే ఈడీ అధికారులు సోదాలు చేశారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అబిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ రావు,సృజన్ రెడ్డికి చెందిన సంస్థలతో పాటు ఇళ్లలో ఈ నెల 6, 7 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు ఈ సోదాల సమయంలో రాబిన్ డిస్ట్రిలరీస్ కార్యాలయం నమోదు చేసిన చిరునామాలో లేదు. ఈ చిరునామాలో బ్యూటీపార్లర్ ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఈడీ అధికారులు ఆరా తీశారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ : రెండో రోజూ హైద్రాబాద్ లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై నిన్న ఢిల్లీలో బీజేపీ నేతలు స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప నేతలకు పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు ఈ స్కాంలో తెలంగాణకు చెందిన కొందరికి ప్రమేయం ఉందని కూడా బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తోసిపుచ్చారు. తన ఇంటితో పాటు కార్యాలయాలు, బ్యాంకు ఖాతాల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఏం సాధించలేదని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ అధికారులు ఎన్ని దఫాలు సోదాలు చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.