జగన్ సన్నిహితుడు మంగలి కృష్ణపై కేసు...ఎందుకంటే...

By Bukka SumabalaFirst Published Sep 16, 2022, 7:58 AM IST
Highlights

ఇంటి అద్దె కట్టకుండా, యజమానికి బెదిరిస్తున్నాడన్న కేసులో ఏపీ ముఖ్యమత్రి వైఎస్ జగన్ సన్నిహితుడిగా పేరొందిన మంగలి కృష్ణపై కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన మంగలి కృష్ణపై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. తాను అద్దెకు ఉంటున్న విల్లాకు సంబంధించి ఏడు నెలలుగా అదే చెల్లించకుండా.. ఇంటి యజమానిని బెదిరించారు.. అంటూ అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ రెండేళ్లుగా కొండాపూర్లోని సైబర్ మెడోస్ గేటెడ్ కమ్యూనిటీలో శివప్రసాద్ రెడ్డి అనే వ్యాపారికి చెందిన విల్లాలో అద్దెకు ఉంటున్నాడు.

నెలకు రూ. 80 వేల అద్దె చెల్లించాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచి  ఇవ్వడం లేదు. పలుమార్లు ఇంటి యజమాని కృష్ణ సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. దీంతో శివప్రసాద్రెడ్డి గట్టిగా ఫోన్ లో నిలదీశారు. అద్దె ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో.. అంటూ కృష్ణ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం గచ్చిబౌలి ఠాణాకు వచ్చిన కృష్ణ తాను ఎవరినీ బెదిరించలేదని ఇంటి అద్దె డబ్బులు ప్రతి నెలా కట్టమని తన డ్రైవర్ కు ఇస్తున్నానని తెలిపాడు. 

భార్యపై కోపం.. కుమార్తెలను కొడుతూ, చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ, వీడియోతీసి ఓ తండ్రి రాక్షసానందం...

డ్రైవర్ ఆ డబ్బులు ఇంటి యజమానికి ఇవ్వలేదని ఇప్పుడే తెలిసింది అని చెప్పాడు. ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి, మంగలి కృష్ణ ఈ విషయమై చర్చించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

click me!