బాత్రుంలో బంధించి మూగ, చెవిటి మహిళపై అత్యాచారం.. ఎదురింటి యువకుడి దారుణం...

Published : Aug 19, 2023, 12:46 PM IST
బాత్రుంలో బంధించి మూగ, చెవిటి మహిళపై అత్యాచారం.. ఎదురింటి యువకుడి దారుణం...

సారాంశం

మూగ, చెవిటి మహిళపై ఎదురింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడ. ఆమెను బాత్రూంలో బంధించి అఘాయిత్యం చేశారు. హైదరాబాద్ లో ఈ దారుణం వెలుగు చూసింది. 

హైదరాబాద్ : హైదరాబాదులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది.  చెవిటి, మూగ మహిళలపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. అదను చూసి ఇంట్లోకి వచ్చిన ఎదురింటి యువకుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చెవిటి, మూగ మహిళ అని తెలిసి.. ఆమెను బాత్రూంలో బంధించి మరీ దారుణంగా అత్యాచారం చేశాడు.

ఈ ఘటన హైదరాబాదులోని హుమాయున్ నగర్ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళా భర్త కూడా దివ్యాంగుడే. ఈ దంపతులిద్దరూ అతని తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త తల్లిని తీసుకుని బయటకు వెళ్లిన సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డ ఎదురింటి యువకుడు సాయి ఈ ఘాతకానికి తెగించాడు.

ముత్తిరెడ్డికే టిక్కెట్టివ్వాలి: జనగామలో అనుచరుల ఆందోళన, ఉద్రిక్తత

బాధితురాలు మూగ కావడంతో  తనమీద దాష్టీకం జరుగుతున్న సమయంలో అరవలేకపోయింది. సాయి ఆ మహిళ మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమెను బాత్రూంలోనే ఉంచి గడియ పెట్టి వెళ్లిపోయాడు. తల్లితో బయటికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గమనించి గడియతీసాడు.  ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన దారుణాన్ని వివరించిందామె. 

వెంటనే ఈ ఘటన మీద హుమాయూన్ నగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. గతంలో కూడా అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం