హైద్రాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జిని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్:విశ్వనగరంగా హైద్రాబాద్ ఎదగాలనే కలకు గట్టి పునాది పడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.హైద్రాబాద్ లో ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.గతంలో హైద్రాబాద్ లో ఏడాదిలో కనీసం వారం పది రోజుల పాటు కర్ఫ్యూ ఉండేదన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఎలాంటి మత ఘర్షణలు లేవన్నారు. అన్ని కులాలు, మతాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా కేటీఆర్ చెప్పారు.
మరోసారి పొరపాటు చేస్తే హైద్రాబాద్ మళ్లీ 100 ఏళ్లు వెనక్కు పోయే పరిస్థితి నెలకొంటుందన్నారు. తెచ్చుకున్న తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.55 ఏళ్ల పాటు అధికారంలో కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మరోసారి వచ్చి మతం, కులం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.పనిచేసే, పనికొచ్చే నాయకుడు కేసీఆర్ ను మూడోసారి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
undefined
Live: Minister Sri speaking after inaugurating Nayani Narasimha Reddy steel flyover from Indira Park to VST. https://t.co/2YHQokUXw0
— BRS Party (@BRSparty)ప్రతిపక్షాలకు చూపించే సినిమా 2023లోనే ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మూడోసారి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడమే విపక్షాలకు సినిమా చూపించడంగా ఆయన పేర్కొన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
also read:హైద్రాబాద్‌లో రూ. 450 కోట్లతో ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి: ప్రారంభించిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 20 ఫ్లైఓవర్లు ప్రారంభించినట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.ఎస్ఆర్‌డీపీ కింద చేపట్టిన పనుల్లో ఈ బ్రిడ్జిని నిర్మించినట్టుగా మంత్రి గుర్తు చేశారు. సెంట్రల్ హైద్రాబాద్ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సెంట్రల్ హైద్రాబాద్ కూడ అభివృద్ది చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. సెంట్రల్ హైద్రాబాద్ ప్రాంతంలో భారీ అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నన్ని కూడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మంత్రి గుర్తు చేశారు. ఇవన్నీ కూడ సెంట్రల్ హైద్రాబాద్ కు కొత్త అందాలను తీసుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇందిరా పార్క్ ను అభివృద్ది చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేసిన వినతిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలను తాను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నానని కేటీఆర్ చెప్పారు. నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు.
Happy to be resolving the decades old longstanding problem of traffic congestion at RTC X Roads, Ashok Nagar and VST junctions
Will be inaugurating a new Flyover/Steel Bridge on 19th August. Built at a cost of ₹450 Crore this 2.63 KM long steel bridge was built by GHMC under… pic.twitter.com/UkDOOSvXS1
ఈ బ్రిడ్జికి నాయిని నరసింహరెడ్డి పేరు పెట్టాలని సీఎం సూచించినట్టుగా కేటీఆర్ చెప్పారు. గతంలో కంటే అద్భుతంగా ట్యాంక్ బండ్ ను నిర్మించుకున్న విషయాన్ని మంత్రి తెలిపారు. హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే భవ్యమైన దివ్యమైన ఆలోచనలు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.
ఇందిరా పార్క్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో బాగు చేస్తామని కేటీఆర్ చెప్పారు.లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్ లను కలుపుతూ ఆధునీకరమైన నిర్మాణాలను చేపట్టనున్నట్టుగా మంత్రి వివరించారు.కులాలు, మతాలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వం తమదని కేటీఆర్ చెప్పారు.ఈ దిశగా కులాలు, మతాలకు అతీతంగా పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని పోతేనే సంపద సృష్టించవచ్చన్నారు.