కన్నతండ్రినే అతి దారుణంగా చంపి.. ఇంటికి నిప్పంటించిన కూతుర్లు, సహకరించిన మనవడు....

Published : Mar 13, 2023, 02:09 PM IST
కన్నతండ్రినే అతి దారుణంగా చంపి.. ఇంటికి నిప్పంటించిన కూతుర్లు, సహకరించిన మనవడు....

సారాంశం

ఆస్తికోసం అతి దారుణంగా వ్యవహించారు ముగ్గురు కూతుర్లు. కన్నతండ్రినే అతి దారుణంగా హతమార్చారు. ఆ తరువాత ఇంటికి నిప్పుపెట్టారు. 

కామారెడ్డి : తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో దిగ్బ్రాంతి కరమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తిని  సొంత కూతుర్లే అతి దారుణంగా హత్య చేశారు.  కొప్పుల ఆంజనేయులు అని 75 ఏళ్ల వ్యక్తిని  కన్నకూతుర్లే చంపేశారు.  ఆ తర్వాత  ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో కొనఊపిరితో ఉన్న ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు. ఆస్తి గొడవల కారణంగానే వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు కూతుర్లు తమకు ఆస్తి ఇవ్వలేదనే  కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. 

తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి చంపేశారు. వీరికి ఆంజనేయులు మనవడు భాను ప్రకాష్ సహకరించాడు. ఇల్లు కాలిపోతుండడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఇంట్లో ఆంజనేయులు కూడా సజీవ దహనం అవడం గమనించారు. ఆస్తికోసం కూతుర్లు, మనవడే ఈ దారుణం చేసి ఉంటారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం ఆంజనేయులు తన ఎకరం భూమిని అమ్మాడు. 

ఈ అమ్మకం ద్వారా అతనికి రూ. 10 లక్షలు వచ్చాయి. అవి తమకు కావాలని కూతుర్లు కోరుకున్నారు. కానీ ఆంజనేయులు ఆ డబ్బులు వారికి ఇవ్వలేదు. దీంతో కూతుర్లు ఇంత దారుణానికి దిగారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందడంతో రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, కంటైనర్ ను ఢీ కొట్టిన కారు.. నలుగురి మృతి...

ఇదిలా ఉండగా, ఆస్తికోసం కన్నతల్లిమీదే దాష్టీకానికి దిగాడో కొడుకు. నవమాసాలు మోసి, కనీపెంచిన తల్లి అని కూడా చూడకుండా హత్య చేసి.. తల,మొండెం వేరు చేశాడు. ఆ తరువాత తలను పట్టుకుని తిరుగుతూ భయోత్పాతాన్ని కలిగించాడు. రెండెకరాల భూమికోసం తల్లిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. ఈ దారుణమైన ఘటన జనగామ జిల్లా మరిగడిలో చోటు చేసుకుంది. దీనిమీద మరిగడి స్థానికులు, జనగామ సిఐఎల్లబోయిన  శ్రీనివాస్ యాదవ్ వివరాలను ఈ మేరకు తెలియజేశారు. కూరాకుల రమణమ్మ (65) మరిగడి నివాసి. ఆమెకు ఇద్దరు సంతానం. కొడుకు కన్నప్ప, కూతురు లావణ్య. కొడుకు, కూతురు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. రమణమ్మ భర్త రాజయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. 

కన్నప్పకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇక కుమార్తె లావణ్య భర్తతో విభేదాల కారణంగా తల్లి దగ్గరే ఉంటుంది. ఇదిలా ఉండగా రమణమ్మ పేరిట పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆమె కొడుకుకు రెండు ఎకరాలు.. కూతురుకు నాలుగెకరాల భూమి రాసిచ్చింది. అయితే కూతురుకు ఇచ్చినట్లే తనకు కూడా మరో రెండు ఎకరాల భూమి రాసి ఇవ్వాలని కన్నప్ప చాలా రోజుల నుంచి తల్లిని అడుగుతున్నాడు. అయినా ఆమె వినడం లేదు. ఇటీవల ఓ రోజు ఇదే వాదనలో కోపంతో కన్నప్ప తల్లిని గోడకేసి కొట్టాడు. 

దీంతో గాయపడిన ఆమె  కన్నప్ప మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది తట్టుకోలేక, మనస్తాపంతో కన్నప్ప రెండు రోజుల క్రితం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని జనగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకొని కన్నప్ప గురువారం ఇంటికి తిరిగివచ్చాడు. రాగానే అతనికి తల్లి మీద కోపం కట్టలు తెంచుకుంది. కత్తి తీసుకుని ఆమె మీద దాడికి దిగాడు. 

మెడ మీద అతికిరాతకంగా నరికేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  కత్తి దాడిలో ఆమె తల, మొండెం వేరైంది. రక్తం దారాలు కట్టింది. తల్లిని హత్య చేసిన తర్వాత కన్నప్ప కోపం ఇంకా తీరలేదు. ఆమె తలను చేత్తో పట్టుకుని.. కొద్దిసేపటి వరకు ఇంటి చుట్టుపక్కల తిరిగాడు. అది గమనించిన స్థానికులు భయాందోళనలు చెందారు. తర్వాత తలను అలాగే పట్టుకొని జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu