నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, కంటైనర్ ను ఢీ కొట్టిన కారు.. నలుగురి మృతి...

Published : Mar 13, 2023, 01:24 PM IST
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, కంటైనర్ ను ఢీ కొట్టిన కారు.. నలుగురి మృతి...

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో ఓ కారు కంటైనర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. 

నిజామాబాద్ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం చంద్రాయణ్ పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కంటెయినర్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కారు హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వైపు వెడుతోంది. వేగంగా కంటైనర్ ను ఢీ కొట్టడంతో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?