నేడు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల.. వివరాలు ఇవే..

Published : Mar 13, 2023, 01:14 PM ISTUpdated : Mar 13, 2023, 02:19 PM IST
నేడు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల.. వివరాలు ఇవే..

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ షర్మిల.. ఈ రోజు ఢిల్లీకి చేరుకోనున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ షర్మిల.. ఈ రోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉదయం చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న వైఎస్ షర్మిల.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాళేశ్వరం పెద్ద స్కామ్ అని.. దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రేపు ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా షర్మిల చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించడంపై షర్మిల స్పందించారు. ‘‘రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా?. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించడం సంతోషం.అదే మేము మీకు వందల సార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు.. మీలో చలనం ఎందుకు రాలేదు?

నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా?. మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలు అంటే మీకు కనపడలేదు..కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అని  అవమానిస్తే మీకు కనపడలేదు.. ఒక ఎమ్మెల్యే అనుచరులు మా మీద దాడి చేస్తే మీకు కనపడలేదు..మహిళలను కించపర్చుతూ మాట్లాడుతున్న అధికార పార్టీ మాటలు మీకు వినబడవు, కనపడవు.. వారి ఆకృత్యాలు కనపడవు.. వారు చేసే అత్యాచారాలు కనపడవు.. కానీ ముఖ్యమంత్రి బిడ్డ మీద చీమ వాలే సరికి మీకు బాధ్యత గుర్తుకువస్తుంది .. ఎందుకంటే మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ కాదు.. మీది బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కమిషన్ .

బీఆర్ఎస్ కమిషన .. బీఆర్‌ఎస్ పార్టీలోని మహిళల కోసం మాత్రమే పనిచేసే కమిషన్. నిజంగా మీది మహిళల కోసం పనిచేసే కమిషన్ అయితే.. మీకు ఇచ్చిన కంప్లైంట్ ల మీద స్పందించి బీఆర్ఎస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే