విజయారెడ్డి, మన్నెలను కలిసిన దానం, సహకరించాలని విజ్ఞప్తి

By Nagaraju TFirst Published Nov 15, 2018, 6:24 PM IST
Highlights

 ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించడంతో దానం నాగేందర్ రంగంలోకి దిగారు. తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. తనతోపాటే ఖైరతాబాద్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నేతలను నేరుగా కలిశారు. టీఆర్ఎస్ పార్టీ రెండో జాబితా బుధవారం రాత్రి ప్రకటించడంతో గురువారం దానం ప్రచారంలో జోరు పెంచారు.
 

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించడంతో దానం నాగేందర్ రంగంలోకి దిగారు. తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. తనతోపాటే ఖైరతాబాద్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నేతలను నేరుగా కలిశారు. టీఆర్ఎస్ పార్టీ రెండో జాబితా బుధవారం రాత్రి ప్రకటించడంతో గురువారం దానం ప్రచారంలో జోరు పెంచారు.

తొలుత తన రాజకీయ గురువు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి నివాసానికి వెళ్లారు. పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చిందని సహకరించాలని కోరారు. అందుకు విజయారెడ్డి సరేనని చెప్పడంతో దానం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు పీజేఆర్ కు ఉన్న బంధాన్ని వివరించారు. తాను ఏనాడు పీజేఆర్ కు అన్యాయం చెయ్యలేదని, ఆయనను కాదని ఏ పని చెయ్యలేదని చెప్పుకొచ్చారు. 

దానం నాగేందర్ విజ్ఞప్తిమేరకు విజయారెడ్డి సైతం తాను సహకరిస్తానని తెలిపారు. తనకు సీఎం కేసీఆర్, కేటీఆర్ లుఫోన్ చేశారని తాను పార్టీకి విధేయురాలిగా ఉంటానని తెలిపారు. తాను పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గం టిక్కెట్ ఆశించి భంగపడ్డ మన్నె గోవర్థన్ రెడ్డి నివాసానికి సైతం దానం నాగేందర్ వెళ్లారు. తనకు సహకరించాలని మన్నె గోవర్థన్ రెడ్డి దంపతులను కోరారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నెగోవర్థన్ రెడ్డి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

 అయితే ఈసారి టిక్కెట్ వస్తుందని ఆశించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టిక్కెట్ దానం నాగేందర్ కు కేటాయించింది. అప్పటికే మన్నెగోవర్థన్ రెడ్డి సతీమణి కవితా రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

దానంకు చిక్కులు, చింతలకు ఊరట: రెబెల్ గా గోవర్ధన్ రెడ్డి భార్య

తెలంగాణ భవన్ వద్ద లాఠీచార్జ్... మన్నె గోవర్థన్ రెడ్డికి గాయాలు (వీడియో)

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత...దానంకు వ్యతిరేకంగా నిరసన(వీడియో)

 

click me!