డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో... సంబరాలు చేసుకుంటూ దళిత బంధు సభకు తరలుతున్న ప్రజలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 16, 2021, 01:17 PM ISTUpdated : Aug 16, 2021, 01:46 PM IST
డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో...  సంబరాలు చేసుకుంటూ దళిత బంధు సభకు తరలుతున్న ప్రజలు (వీడియో)

సారాంశం

దళిత సాధికారత కోసం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ హుజురాబాద్ నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం జరిగుతున్న భారీ బహిరంగ సభ కోసం దళిత ప్రజలు సంబరాలు చేసుకుంటూ బయలుదేరారు. 

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో సోమవారం దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం హుజురాబాద్ మండలం శాలపల్లిలో తలపెట్టిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీంతో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నియోజకవర్గంలోని గ్రామ గ్రామంనుండి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో ఐదు మండలాల నుండి శాలపల్లి దళిత బంధు సభకి పెద్దఎత్తున దళితులు, మహిళలు తరలివెళుతున్నారు.  

హుజురాబాద్ మండలం‌ నుండి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎం సభకి తరలివెలుతున్నారు. హుజురాబాద్ చౌరస్తాలో భారీ జనసమీకరణ అనంతరం శాలపల్లి సభ వద్దకు ర్యాలీగా  బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో హుజురాబాద్ చౌరస్తా సందడిగా మారింది. 

వీడియో

ఇక వీణవంకలోని ఎస్సీ కాలనీ నుంచి సీఎం సభకు మహిళలు బయలుదేరారు. వీరిని దగ్గరుండి బస్సులో ఎక్కించి పంపించారు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ లక్ష్మణరావు. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామం నుండి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో బారీగా దళిత ప్రజలు సిఎం సభకి తరలివెలుతున్నారు.

read more  నేడే హుజురాబాద్ లో దళిత బంధు... సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు Volume 90%

ఇలా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి ప్రత్యేక బస్సుల్లో దళిత సమాజం శాలపల్లి బాట పట్టారు. ఇక ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ స్వాగత ప్లెక్సీలతో నిండిపోయాయి. సభాస్థలం వద్ద కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. 

దళిత సాధికారత కొసం తెలంగాణ సర్కార్ దళిత బంధు తీసుకొచ్చింది. ఈ క్రమంలో  దళిత బంధును ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి ప్రసంగం చేస్తారని కేవలం హుజురాబాద్ ప్రజలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.