వరంగల్ లో అమానవీయం... స్మశాన వాటికలో అప్పుడే పుట్టిన పసిగుడ్డు

Arun Kumar P   | Asianet News
Published : Aug 16, 2021, 12:03 PM IST
వరంగల్ లో అమానవీయం... స్మశాన వాటికలో అప్పుడే పుట్టిన పసిగుడ్డు

సారాంశం

వరంగల్ లో మానవత్వానికి మచ్చలా నిలిచే సంఘటన బయటపడింది. అప్పుడే పుట్టిన పసిగుడ్డును స్మశానవాటికలో పడేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని కసాయి వ్యక్తులు. 

వరంగల్: ఆ తల్లికి ఏ కష్టంవచ్చిందో ఏమో గానీ కడుపునపుట్టిన బిడ్డను కాదనుకుంది. కనీసం ఒక్క రోజు వయసు కూడా లేని పసిగుడ్డును గుర్తుతెలియని వ్యక్తులు స్మశాన వాటికలో విడిచిపెట్టి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.   

వరంగల్ లోని శివనగర్ స్మశానవాటికలోంచి చిన్నపిల్లాడి ఏడుపు వినిపిస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా పసిగుడ్డు కనిపించింది. రోజులు కూడా నిండని ఆ పాపకు సంబంధించిన వారు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో వదిలించుకోవడానికే ఇలా స్మశానవాటికలో వదిలివెళ్లినట్లు భావించారు. వారు కూడా తమకేమీ పట్టనట్లు అమానవీయంగా వ్యవహరించకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సీతాపాలెం బీచ్‌లో హృదయవిధారక ఘటన... అన్న కళ్ళముందే సముద్రంలో మునిగిన తమ్ముడు (వీడియో)

స్థానికుల సమాచారంతో స్మశానవాటికకు చేరుకున్న పోలీసులు శిశుసంక్షేమ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారి సాయంతో పసిపాపను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పసిగుడ్డును ఇలా కర్కశంగా వదిలివెళ్లిన తల్లిదండ్రులు ఎవరా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?