Dalit Bandhu: దళిత బంధు బీఆర్‌ఎస్ బంధుగా మారిందని పేర్కొంటూ పలు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. దళిత బంధులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణలో నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రజాప్రతినిధుల బంధువులు, కుటుంబ సభ్యులు, సంబంధిత క్యాడర్ ను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దళిత బంధు కాదు బీఆర్ఎస్ బంధుగా మారిందని ఆరోపిస్తున్నారు.
Dalit Bandhu scheme: దళిత బంధు బీఆర్‌ఎస్ బంధుగా మారిందని పేర్కొంటూ పలు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. దళిత బంధులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణలో నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రజాప్రతినిధుల బంధువులు, కుటుంబ సభ్యులు, సంబంధిత క్యాడర్ ను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దళిత బంధు కాదు బీఆర్ఎస్ బంధుగా మారిందని ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. దళితబంధు పథకం యూనిట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దళిత వర్గానికి చెందిన మహిళలు బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పథకం ప్రయోజనాలను అనర్హులకు కేటాయించడంపై సర్పంచ్, ఎంపీటీసీలను ఆందోళనకారులు ఖండించారు. దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్ బంధుగా మార్చారని, అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల బంధువులు, కుటుంబ సభ్యులను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆరోపించారు. నిజంగా అర్హులేనా అని సరిచూసుకున్న తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు.
undefined
అయితే గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరును జాబితాలో చేర్చామనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజాప్రతినిధులు ఆందోళనకారులకు తెలిపారు. అయినప్పటికీ హామీతో సంబంధం లేకుండా తమ పేర్లను ప్రకటించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. ఆందోళనకారులు శాంతించకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని చెదరగొట్టారు. ఈ పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన దళితులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో దళిత బంధు అనేది నిరుపేద దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం రూపొందించిన సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు పంపిణీ చేస్తుంది.
దళిత బంధు పథకానికి లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. గజ్వేల్ లో అక్రమాలకు నిరసనగా సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పైగా కొండపాక మండలంలో నిత్యం దళితులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికకు స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరికి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో అంకిరెడ్డిపల్లి జిల్లాలోని నిరుపేద దళితులకు భూమి, ఉద్యోగాలు, ఆస్తులను న్యాయంగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల పాటు నిరసన చేపట్టారు. ఇదే అంశంపై పటాన్ చెరు నియోజకవర్గంలో కూడా దళితులు నిరసన వ్యక్తం చేశారు. మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. రెండో దశ తర్వాత ఈ సంఖ్యను 1200కు పెంచారు.