వామ్మో.. డెయిరీ మిల్క్ చాక్లెట్ లో బతికున్న పురుగు..వీడియో వైరల్, స్పందించిన క్యాడ్బరీ.

By Sairam Indur  |  First Published Feb 11, 2024, 2:01 PM IST

సూపర్ మార్కెట్ కు వెళ్లి చాక్లెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. తీరిగ్గా ఇంటికి వెళ్లి చాక్లెట్ కవర్ చింపితే అందులో బతికున్న పురుగు (A surviving worm appears in dairy milk chocolate) కనిపించింది. దీనిని ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ చాక్లెట్ కంపెనీ స్పందించింది. 


చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా వాటిని అందరూ తింటుంటారు. ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ లు కూడా ధీర్ఘకాలంలో అనారోగ్యానికి గురి చేస్తాయని నిపుణులు హెచ్చరించిన వాటిని మనం వదలం. అయితే ఈ చాక్లెట్ లు ధీర్ఘకాలంలోనే కాదు.. చూసుకోకుండా తింటే ఇప్పుడే అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. వాటిని తయారు చేసే ప్రాంతంలోనో, లేదా ప్యాకింగ్ చేసే ప్రాంతంలోనో నిర్లక్ష్యంగా వ్యవహించడమే దానికి కారణం. 

మీ పేరెంట్స్ నాకు ఓటేయకపోతే 2 రోజులు తినకండి.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే వింత సలహా.. వైరల్..

Latest Videos

హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్ లో బతికున్న పురుగు కనిపించింది. చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులో మారిపోయి అటూ ఇటూ కదులుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జాచియస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. దానిని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద కొనుగోలు చేశానని చెబుతూ, దానికి సంబంధించిన బిల్ ను కూడా జత చేశారు.

డెయిరీ మిల్క్ చాకట్ లో పురుగులు ఉండటం పట్ల సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని, క్యాడ్బరీ ప్రశ్నించారు. గడువు తీరిన ఈ ఉత్పత్తులకు క్వాలిటీ చెక్ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ నిలదీశారు. ఈ పోస్ట్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), క్యాడ్బరీ డెయిరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేస్తూ, తన కొనుగోలు బిల్లు ఫొటోను షేర్ చేశారు.

పాకిస్థాన్ లో రోడ్డెక్కిన పీటీఐ మద్దతుదారులు.. దేశ వ్యాప్తంగా నిరసనలు.. అసలేమైందంటే ?

అయితే దీనిపై క్యాడ్బరీ స్పందించింది. ‘‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. 

వావ్.. నదిలో జాలర్లకు దొరికిన అరుదైన భారీ స్పటిక శివలింగం.. ఎంత విశిష్టమైనదో తెలుసా ?

మీ ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవడానికి మేము ఈ వివరాలు కోరుతున్నామని స్పష్టం చేసింది. కాగా.. చాక్లెట్ లో పురుగు వచ్చిన ఘటనపై జీహెచ్ ఎంసీ కూడా స్పందించింది. ఈ ఘటనను సంబంధిత ఫుడ్ సేఫ్టీ టీమ్ కు వివరించామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని పేర్కొంది.

click me!