పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్కరం: కేసీఆర్

Published : Aug 04, 2022, 03:57 PM ISTUpdated : Aug 04, 2022, 04:28 PM IST
పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్కరం: కేసీఆర్

సారాంశం

పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్కరమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. గురువారం నాడు ఇంటిగ్రేటేడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.   

హైదరాబాద్: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజానికి శ్రేయస్కరమని తెలంగాణ సీఎం KCR చెప్పారు. గురువారం నాడు హైద్రాబాద్ ఇంటిగ్రేటేడ్  Police command control centre ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.   పోలీస్ వ్యవస్థకు కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్థంభంగా ఉంటుందన్నారు. 

 పోలీస్ కమాండ్ కంట్రోల్ రూపకర్త డీజీపీ Mahender Reddy అని సీఎం గుర్తు చేశారు.రెండేళ్ల క్రితమే ఈ కమాండ్ కంట్రోల్ భవనం పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే అనేక కారణాలతో భవన నిర్మాణం ఆలస్యమైందని సీఎం చెప్పారు.  ఇందుకు Corona  కూడా కారణమన్నారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చామన్నారు. రూ. 13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ తాము రూ. 14 కోట్ల లాభాల్లోకి తీసుకు వచ్చినట్టుగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

also read:పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్: ప్రారంభించిన సీఎం కేసీఆర్

సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ గా మారాయన్నారు. సైబర్ క్రైమ్ కట్టడికి చర్యలు తీసకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనికి డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలన్నారు. నేరాలు చేసేవారు రూపాల్ని మారుస్తున్నారన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం నుండి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు డ్రగ్స్ మహమ్మారిని పారదోలాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పోలీస్ శాఖకు నొక్కి చెప్పారు.

తెలంగాణలో ప్రెండ్లీ పోలీస్ ఉందని  సీఎం చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మరింత వేగంగా  రాష్ట్రంలో పోలీస్ శాఖ స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను  మాజీ పోలీస్ ఉన్నతాధికారులు చూపించాలని కేసీఆర్  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి సూచించారు

సమాజంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు చేస్తున్న కృషికి తాను  సెల్యూట్‌ చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.  ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందన్నారు. సింగపూర్ కు తాము వెళ్లిన సమయంలో తమతో పాటు వచ్చిన మహిళా ఐఎఎస్ అధికారి రాత్రిపూట ప్రయాణం చేసిన సమయంలో భద్రత ఎలా ఉందోననే విషయాన్ని తాము స్వయంగా పరిశీలించామన్నారు. అయితే ఆ సమయంలో మహిళా ఐఎఎస్ తో  తన కార్యాలయంలో పనిచేసే అధికారి కూడా ఆమెతో కొద్ది దూరం ప్రయాణం చేసిన విషయాన్ని  ఆయన గుర్తు చేసుకున్నారు. . రిటైరైన పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని కూడా కేసీఆర్ డీజీపీని కోరారు.  రాష్ట్రంలో పోలీసింగ్  విధానం దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు.  అనంతరం తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu