స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం రాజగోపాల్ రెడ్డి యత్నాలు.. ఈ నెల 7 వరకు కష్టమే, 8 తర్వాతే రాజీనామా

By Siva KodatiFirst Published Aug 4, 2022, 3:26 PM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఈ నెల 7 వరకు స్పీకర్ అందుబాటులో వుండరని అసెంబ్లీ అధికారులు ఆయనకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగస్ట్ 8న స్పీకర్‌కు రాజీనామా సమర్పించనున్నారు రాజగోపాల్ రెడ్డి. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఈ నెల 7 వరకు స్పీకర్ అందుబాటులో వుండరని అసెంబ్లీ అధికారులు ఆయనకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగస్ట్ 8న స్పీకర్‌కు రాజీనామా సమర్పించనున్నారు రాజగోపాల్ రెడ్డి. 

కాగా... మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని త్వరలోనే కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో  ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైద్రాబాద్ లో రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా కొందరు నేతలు ఆయనతో పాటే సమావేశంలో పాల్గొన్నారు. 

మరోవైపు.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనుంది. ఆయా మండలాల్లో పర్యటిస్తూ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. 

Also REad:రాజగోపాల్ రెడ్డి వెంట పయనం: నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులపై వేటేసిన కాంగ్రెస్

ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై చాలా కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా .. బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని కూడ రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రకటించారు.పార్టీని వీడొద్దని కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపే సమయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ దేశంలో సమర్ధవంతమైన పాలనను అందిస్తుందని కూడా రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

click me!