సోషల్ మీడియా లింకులతో రూ.400 కోట్లు టోకరా.. ఆపై విదేశాలకు బదిలీ, కేటుగాడిని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

Siva Kodati |  
Published : Aug 20, 2023, 07:33 PM IST
సోషల్ మీడియా లింకులతో రూ.400 కోట్లు టోకరా.. ఆపై విదేశాలకు బదిలీ, కేటుగాడిని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

సారాంశం

సోషల్ మీడియాలో లింకులతో ఏకంగా రూ.400 కోట్లు కొట్టేసిన కేటుగాడిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశంలో వున్న అనేక మంది అకౌంట్ల వివరాలు సేకరించిన నిందితుడు.. వందల సంఖ్యలో ఏజెంట్ల ద్వారా నకిలీ ఖాతాలు క్రియేట్ చేయించాడు. 

సోషల్ మీడియాలో లింకులతో ఏకంగా రూ.400 కోట్లు కొట్టేశాడో కేటుగాడు. కొట్టేసిన 400 కోట్లను విదేశాలకు తరలించాడు. సైబర్ మోసగాడు భరత్ కాక్రేను ముంబైలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి రోజుకు లక్షల్లో సైబర్ చీటర్స్ కాజేస్తున్నారు. దేశంలో వున్న అనేక మంది అకౌంట్ల వివరాలు సేకరించిన నిందితుడు.. వందల సంఖ్యలో ఏజెంట్ల ద్వారా నకిలీ ఖాతాలు క్రియేట్ చేయించాడు. 

సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బును నిందితుడు అకౌంట్లకు బదిలీ చేయించాడు. ఈ ఖాతాల నుంచి చైనా, తైవాన్‌లలో వున్న వారికి బదిలీ చేశారు. కోట్ల రూపాయలను బిట్‌కాయిన్ రూపంలో , నకిలీ ఖాతాల ద్వారా బదిలీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితుడి ఫిర్యాదుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ముంబైలో రోనాక్ భరత్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇతని మోసాలపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే