
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డిపై కర్రలతో దాడి చేశారు బీఆర్ఎస్ నేతలు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దళితుల భూమిని సర్పంచ్ కబ్జా చేశాడంటూ చేసిన వ్యాఖ్యలపై సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ చందర్ అతని అనుచరులు అనిరుధ్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.