
కామారెడ్డి: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాకు ఓ డిప్యూటీ తహసీల్దార్ సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి కాస్త ఏమరపాటుగా వ్యవహరించినందుకు సదరు అధికారి లక్షల్లో డబ్బులు కోల్పోవాల్సి వచ్చింది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా (kamareddy district) కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పని చేస్తున్నాడు. అయితే అతడు తాజాగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఈ-కేవైసీ పేరుతో సైబర్ కేటుగాళ్ళు అతడిని బురిడీ కొట్టించారు. ఇలా రంజిత్ అకౌంట్ లో నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను సైబర్ దొంగలు(cyber cheaters) దోచేసారు.
తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం అవడంతో మోసపోయానని గ్రహించిన రంజిత్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితులను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
read more సైబర్ హ్యాకర్ల్ బారిన పడ్డ ‘గో డాడీ’.. 12 లక్షల మంది యూజర్ల డేటా ప్రమాదంలో..
ఇలాంటి సైబర్ నేరాల (cyber crime) పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని పోలీసలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఫోన్ కు వచ్చే లింకులను ఓపెన్ చేయడం, ఓటిపి లను ఇతరులకు చెప్పడం వంటివి చేయరాదని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని... వారి బారిన పడకుండా వుండాలంటే ముందుజాగ్రత్త ఒక్కటే మార్గమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల భారీగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసుల (cyberabad police) అరెస్ట్ చేసారు. ఎస్బిఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్ (Call centers) ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఎస్బిఐ (sbi) కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్ఫూపింగ్ యాప్ దారా ఎస్బిఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదనట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
read more కొంపముంచిన ఆన్ లైన్ షాపింగ్.. రూ.99 ఇయర్ ఫోన్స్ కొంటే.. రూ.33 లక్షలు మాయం... !!
ఎస్బిఐ ఏజెంట్స్ (SBI agents) నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకుని Credit card దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్బిఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు Spoofing app వాడుతున్నారని.. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని సీపీ తెలిపారు.
1860 180 1290 నెంబర్ ను స్ఫూఫింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30 సెల్ ఫోన్లు, మూడు లాప్టాప్లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.