cyber crime:అమ్మాయిల మాయమాటలతో మస్కా... లక్షల్లో దోచేస్తున్న కేటుగాళ్లు

Arun Kumar P   | Asianet News
Published : Jul 02, 2021, 10:46 AM IST
cyber crime:అమ్మాయిల మాయమాటలతో మస్కా... లక్షల్లో దోచేస్తున్న కేటుగాళ్లు

సారాంశం

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి ఇటీవల కాలంలోనే హైదరాబాద్ కు చెందిన కొందరు నిలువునా మోసపోయారు.  

హైదరాబాద్: అమ్మాయిలతో మాట్లాడించడమే పెట్టుబడిగా అమాయకుల నుండి భారీ సొత్తును దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలా కిలేడీలు ఫోన్ చేసి మాయమాటలు చెబితే నమ్మారో... మీ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి ఇటీవల కాలంలోనే హైదరాబాద్ కు చెందిన కొందరు నిలువునా మోసపోయారు.

హైదరాబాద్ లోని పంజాగుట్టకు చెందిన సురేష్ యాదవ్ అనే యువకుడికి ఆన్లైన్ కంపనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ ఫోన్ వచ్చింది. ఓ యువతి మధురమైన స్వరంతో మాయమాటలు చెప్పడంతో నిజమేనని నమ్మిన అతడు లక్షా అరవైవేలు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.  

read more  న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్... సైబర్ ఛీటర్ వలలో హైదరబాదీ

ఇలాంటిదే మరో ఘటన అంబర్ పేటలో చోటుచేసుకుంది. అమెజాన్ సేల్స్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటే అంబర్ పేట్ వాసి రవీందర్ కు ఓ యువతి ఫోన్ చేసింది. ఆమె మాయమాటలు నమ్మిన ట్రాప్ లో పడ్డ అతడు రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు. ముందుగా పదివేల పెట్టుబడికి లాభాలు చూపించి ముగ్గులోకి లాగారు. దీంతో అతడు రెండులక్షల దాకా పెట్టుబడి పెట్టగా తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని ఫోన్లు బ్లాక్ చేసారు. ఇది పెట్టుబడి కాదు సైబర్ నేరగాళ్ల మోసమని గ్రహించిన అతడు  పోలీసులను ఆశ్రయించాడు. 
 
ఇక బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ అకౌంట్ వివరాలు సేకరించి అందులోని డబ్బులను కాజేయడం మరోరకం సైబర్ మోసం. ఇలా క్రెడిట్ కార్ట్ పరిమితి పెంచుతామంటూ ఓ యువతి నుండి పాతబస్తా ధూల్ పేట్ వాసి అనిల్ సింగ్ కు ఓ కాల్ వచ్చింది. నిజమేనని నమ్మిన అతడు తన అకౌంట్ వివరాలను సదరు యువతికి తెలియజేశారు. ఇంకేముందు కొద్దిక్షణాల్లోనే అతడి అకౌంట్ నుండి లక్షా ఇరవైవేలు మాయమయ్యాయి.  దీంతో మోసపోయానని గ్రహించిన అతడు కూడా పోలీసులను ఆశ్రయించాడు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ