వెంకటాపురం బెటాలియన్‌లో కాల్పులు: సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ మృతి, కానిస్టేబుల్‌కి గాయాలు

By narsimha lode  |  First Published Dec 26, 2021, 9:22 AM IST

వెంకటాపురం బెటాలియన్ లో ఆదివారం నాడు జరిగిన కాల్పుల్లో సీఆర్‌పీఎప్ ఎస్ఐ సతీష్ చంద్ర మరణించారు. మరొక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. 


వెంకటాపురం: Mulugu జిల్లా venkatapuram A 39 Battalion లో ఆదివారం నాడు  Firing చోటు చేసుకొన్నాయి. మెస్ కమాండెంట్‌‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో  వివాదం తీవ్రమై కాల్పులకు దారి తీసింది. పరస్పరం జరుపుకున్న కాల్పుల్లో సీఆర్‌పీఎప్ ఎస్ఐ  umesh Chandra మరణించారు.  ఈ కాల్పులను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన CrpF కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ను  అధికారులు ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు ఏటూరు నాగారం ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

ములుగు జిల్లాలోని  వెంకటాపురం ప్రాంతంలో మావోయిస్టులను అరికట్టేందుకు గాను ప్రభుత్వం ఈ ప్రాంతంలో  ఏ 39 బెటాలియన్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో  ఈ బెటాలియన్ లో మెస్ ఇంచార్జీ, సీఆర్‌పీఎప్ ఎస్ఐకి మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో  మెస్ ఇంచార్జీ స్టీఫెన్ కు సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్ర మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సమయంలో మెస్ కమాండంట్ స్టీఫెన్  సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్రపై కాల్పులకు దిగాడు.  ఉమేష్ చంద్ర కూడా స్టీఫెన్ పై కాల్పులకు దిగాడు. ఇరువురి మధ్య నాలుగు రౌండ్ల కాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ కాల్పుల్లో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మరణించారు.  మెస్ ఇంచార్జీ స్టీఫెన్ తీవ్రంగా గాయపడ్డారు.

Latest Videos

undefined

also read:తెలంగాణ- ఛత్తీస్‌గడ్ బోర్డర్‌లో మావోల అలజడి: పోలీసుల టార్గెట్‌గా మందుపాతర.. ఒకరికి గాయాలు

ఈ ఘటనలో మరణించిన సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్ర బీహార్ రాష్ట్రానికి చెందినవాడు.  మెస్ కమాండెంట్ స్టీఫెన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడుగా పోలీసులు తెలిపారు. మెస్ కమాండెంట్ స్టీఫెన్ కు తల, చాతీ భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి.   తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్టీఫెన్ దవడ, కంటికి తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యలు తెలిపారు. స్టీఫెన్ ను మెదడుకు కూడా గాయాలయ్యాయా అనే విషయమై వైద్యలు పరీక్షిస్తున్నారు. 

click me!