Omicron విజృంభణ వేళ కలకలం... మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్

By Arun Kumar PFirst Published Dec 26, 2021, 8:08 AM IST
Highlights

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు టీఆర్ఎస్ చేవెళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు.ఇటీవలే న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన వీరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ (omicron) భయం వెంటాడుతున్న సమయంలో కరోనా కేసుులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు మొదలు విఐపీ ఎవరినీ కరోనా (corona virus) వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే న్యూడిల్లీ నుండి తిరిగివచ్చిన మంత్రి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో హోంక్వారంటైన్ లోకి వెెళ్లిన మంత్రి తనను కలిసిన వారు కూడా ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 

టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (ranjith reddy)కి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేసిన ఎంపీ కొవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.  

తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడానికి రాష్ట్ర మంత్రుల బృందం దేశరాజధాని డిల్లీలో పర్యటించింది. ఈ బృందంలో మంత్రి ఎర్రబెల్లి కూడా వున్నారు. డిల్లీలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తో పాటు పలువరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అలాగే తోటి మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి తిరిగారు. తాజాగా ఆయనకు కరోనా నిర్దారణ కావడంతో కలకలం రేగింది. 

ఇక ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా డిల్లీలోని రాష్ట్ర మంత్రుల బృందంలో కలిసి తిరిగారు. అలాంటిది ఆయనకు కరోనా నిర్దారణ కావడం దేశ రాజధానిలో కలకలం రేగింది. 

read more  తెలంగాణలో పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా ముగ్గురికి నిర్ధారణ, 41కి చేరిన సంఖ్య

ఒమిక్రాన్ విజృంభిస్తున్న సమయంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంపి రంజిత్ రెడ్డికి కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. వీరి నుండి నమూనాలను సేకరించి జినోమ్ పరీక్షకు పంపించారు. ఈ టెస్ట్ ఫలితాలు వాల్సివుంది.

ఇదిలావుంటే ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి గత 24 గంటల వ్యవధిలో 333 మంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా ఎనిమిది మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. 

ఇక ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 11,245 మంది ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 83 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా.. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఒమిక్రాన్ బారినపడిన వారిలో చికిత్స అనంతరం 10 మంది కోలుకోగా.. మరో 20 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  

read more  తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే

ఇదిలావుంటే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 26,947 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 140 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా (corona cases) కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌తో మరణించిన (corona deaths in telangana) వారి సంఖ్య 4,021కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 186 మంది కోలుకున్నారు. వీటితో కలిపి తెలంగాణలో రికవరీల సంఖ్య 6,73,033కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,499 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  
 

click me!