సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసనగండ్లకు చెందిన స్వామి, నవిత దంపతులు. వీరి మధ్య ఘర్షణలు పెరగడంతో మనస్తాపంతో ఆమె ఘాతుకానికి పాల్పడింది. ఒకటిన్నరేళ్ల తమ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అదే నిప్పు అంటించుకుని తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ సజీవ దహనమయ్యారు.
హైదరాబాద్: భార్య భర్తల (Couple) మధ్య ఘర్షణలు కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను తీశాయి. Husband మీద కోపంతో ఆ భార్య(Wife) ఒక్కటిన్నర ఏళ్ల వయసున్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తానూ నిప్పు అంటించుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. భర్త పొలం పనికి వెళ్లగానే భార్య ఈ పనికి ఒడిగట్టింది. ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో అనుమానంతో స్థానికులు తలుపులు తీశారు. తల్లీ, కొడుకు మంటల్లో కాలిపోతూ కనిపించారు. విషయం తెలుసుకుని పరుగున ఇంటికి భర్త వచ్చాడు. ఆమెను చూసి గుండెలు అవిసేలా రోధించాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో శనివారం చోటుచేసుకుంది.
సిరిసినగండ్ల గ్రామానికి చెందిన గవ్వల స్వామికి, నవిత స్వయానా అక్క కూతురు. వీరిద్దరూ మూడేళ్ల క్రితం వివాహ: చేసుకున్నారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే. ఈ దంపతులకు ఏడాదిన్నిర వయసు గల మణిదీప్ కుమారుడు ఉన్నాడు. ఆ దంపతులకు ఈ మధ్య తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అదే రీతిలో శనివారం ఉదయం కూడా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు.
undefined
Also Read: కూతురిని వేధించడంతో అల్లుడి ఇంటిపై కత్తులు, కారంతో దాడి.. ఒకరు మృతి
గొడవతో అదిరిన పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఆ పిల్లాడిని చూసి బాధతతో తండ్రి స్వామి ఎత్తుకున్నాడు. తింపుతూ.. తిరుగుతూ ఏడుస్తున్న చిన్నారిని ఊకోబెట్టాడు. తన భుజాలపైనే నిద్ర పోయాడు. అప్పుడు భార్య పక్కనే పడుకోబెట్టి పొలానికి వెళ్లిపోయాడు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నది. ఆ తర్వాత సుమారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటిలో నుంచి పొగ వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. మెల్లగా వెళ్లి చూడగా.. తల్లీ, కొడుకులు మంటల్లో కాలిపోతూ కనిపించారు. ఇదే విషయాన్ని భర్తకు ఫోన్ చేసి స్థానికులు చెప్పారు. ఈ విషయం తెలియగానే స్వామి వెంటనే ఇంటికి పరుగున వెళ్లాడు. మంటల్లో కాలిపోయిన భార్య, కుమారుడిని చూసి గుండెలు బరువెక్కేలా ఏడ్చాడు. కాగా, భర్త వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని నవిత తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
బొక్కమంతలపాడు గ్రామానికి చెందిన సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె శ్యామల. ఆమె వివాహాన్ని బయటి ఊరి వారికి కాకుండా అదే ఊరిలోని వ్యక్తితో జరిపించారు. అదే గ్రామానికి చెందిన భిక్షమయ్య, అచ్చెమ్మ దంపతుల కుమారుడు శివనారాయణతో శ్యామల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి సమయంలో కట్నం కింద ఒక ఎకరం భూమి, పన్నెండున్నర తులాల బంగారం ఇచ్చారు.
Also Read: నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు
శివనారాయణ, శ్యామల దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉన్నది. కూతురు పుట్టిన తర్వాత అదనపు కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. మరింత కట్నం తేవాలని అత్తింటి వారి కుటుంబం శ్యామలను ఒత్తిడి చేసేవారు. ఈ కారణంగా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. అల్లుడు కూడా శ్యామలపై వేధింపులు చేపడుతున్నాడు. ఈ విషయం శ్యామల తల్లిదండ్రులకు తెలిసినప్పటి నుంచి వారిలో బాధ మొదలైంది.
సుమారు పది నెలల క్రితం శ్యామల సోదరుడు శివ వివాహం ఉన్నది. కానీ, ఆ వివాహానికి శ్యామలను పంపలేదు. సోమవారం కూడా శ్యామలపై భౌతిక దాడికి దిగాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మామయ్య, బావమరిది శివకు ఫోన్ శివనారాయణ స్వయంగా చెప్పాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయమే కత్తులు, కారంతో శివనారాయణ ఇంటి మీదకు వెళ్లారు. శివనారాయణను కత్తితో పొడిచారు. శివనారాయణ తల్లి అచ్చెమ్మ ఇతరులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చెమ్మ అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డరు.