వరంగల్ రాంపూర్ చెరువులో భారీ మొసలి

First Published Jun 4, 2018, 6:22 PM IST
Highlights

భయం.. భయం..

వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం, రాంపూర్ శివారులో ఉన్న చెరువులో భారీ మొసలి ఒకటి జనాలను కలవరపాటుకు గురి చేసింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా రాంపూర్ చెరువులో మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువులో ఉన్న బురదలో మొసలి కూరుకుపోయి ఉన్నట్లు బుల్డోజర్ డ్రైవర్ గుర్తించారు. డోజర్ సాయంతో కట్టను తవ్వగా మొసలి బయటకు వచ్చింది. దీంతో వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  అటవీ సిబ్బంది వచ్చి మొసలిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆ మొసలిని పాకాల చెరువలో వదిలేశామని జిల్లా అటవీ శాఖాధికారి పురుషోత్తం మీడియాకు తెలిపారు.

click me!