కాంగ్రెస్ తాజా ప్రతిపాదన: పొత్తుపై నేడు తేల్చనున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గం

By narsimha lode  |  First Published Oct 29, 2023, 10:10 AM IST

కాంగ్రెస్‌తో పొత్తుపై  సీపీఎం ఇవాళ  తేల్చనుంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  సీట్ల సర్ధుబాటుపై  సీపీఎం రాష్ట్ర కార్యవర్గసమావేశంలో  చర్చించనున్నారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ తో పొత్తు విషయమై  సీపీఎం రాష్ట్ర కమిటీ ఆదివారంనాడు తేల్చనుంది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో   కాంగ్రెస్ తో పొత్తు విషయమై  ఆ పార్టీ కీలక నిర్ణయాన్ని తేల్చనుంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఐ, సీపీఎంలతో  కలిసి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రెండు పార్టీలతో  కాంగ్రెస్ నాయకత్వం  చర్చిస్తుంది.  సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. సీపీఎంకు  మిర్యాలగూడతో పాటు  మరో అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించింది. అయితే  మిర్యాలగూడను మినహాయించి హైద్రాబాద్ లో  ఓ అసెంబ్లీ స్థానంతో పాటు  ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  సీపీఎం వద్ద ప్రతిపాదించిందని సమాచారం.  

Latest Videos

undefined

మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతో పాటు  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాలేరు అసెంబ్లీ స్థానం తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుంది.  పాలేరు ఇవ్వలేని పక్షంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ స్థానం కోసం  కాంగ్రెస్ వద్ద సీపీఎం నేతలు  ప్రతిపాదించారని తెలుస్తుంది. ఇతర పార్టీల నుండి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో  లెఫ్ట్ పార్టీలు కోరుతున్న సీట్లకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుండి  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరితే  చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని వెంకటస్వామికి కాంగ్రెస్ కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు.వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  భేటీ అయ్యారు. 

ఇదిలా ఉంటే   హైద్రాబాద్ నగరంలోని అసెంబ్లీ స్థానంతో పాటు  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని  కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీపీఎం వద్ద తాజా ప్రతిపాదనలను పంపింది. ఈ  ప్రతిపాదనపై సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ చర్చించనుంది.

తాము కోరిన  సీట్లను కేటాయించకపోతే  అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది.   పొత్తుల విషయమై  సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి,  డి. రాజాలతో కాంగ్రెస్ జాతీయ నేతలు కూడ పొత్తులపై చర్చించే అవకాశం ఉందని  కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. 

also read:కారణమిదీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం

లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డిలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదనలపై సీపీఎం ఏ రకంగా స్పందిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 

click me!