కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు మరణించిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ రైతుకు మొదట కరెంట్ షాక్ వచ్చి కుప్పకూలగా.. అతడిని కాపాడేందుకు మరో రైతు ప్రయత్నించాడు. దీంతో అతడూ ప్రాణాలు కోల్పోయాడు.
వికారాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రైతులకు కరెంట్ షాక్ తగలడంతో అతడిని కాపాడబోయి మరో రైతు కూడా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దౌల్తాబాద్ మండలంలో ఈ ఘటన జరిగింది.
telangana weather : పగలు ఉక్కపోత.. రాత్రి గజగజ.. తెలంగాణలో విచిత్ర వాతావరణం..
undefined
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవర్ పస్లావాద్ గ్రామంలో 49 ఏళ్ల వెంకటప్ప, లొట్టిగుంటతండాలో 54 ఏళ్ల చందర్ నాయక్ అనే రైతులు నివసిస్తున్నారు. వీరిద్దరి పొలాలు పక్కపక్కనే ఉండటంతో పనుల సమయంలో తరచూ కలుస్తూ ఉండేవారు. వెంకటప్ప పొలంలో బావి ఉంది. దీంతో ఆయన తనకు ఉన్న మూడు ఎకరాల్లో వేరు శనగ, వరి సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న చందర్ నాయక్ పొలంలో నీటి వసతి లేదు.
బాలికపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో దుశ్చర్య..
అయితే పక్క పొలంలో ఉన్న బావి నుంచే తన పొలానికి నీటిని అందిస్తున్నారు. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరు రైతులు తమ పనిలో నిమగ్నం అయ్యారు. పొలానికి నీరు అందించేందుకు ఇద్దరూ స్పింక్లర్లను ఏర్పాటు చేశారు. అనంతరం మోటార్ దగ్గర కనక్షన్ ఇచ్చేందుకు ఇద్దరు రైతులూ కలిసి వెళ్లారు.
విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి కుటుంబ సభ్యుల సూసైడ్.. కారణమేంటంటే ?
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ మోటార్ కు ఉన్న కరెంట్ తీగపై వెంకటప్ప కాలు పెట్టాడు. దీంతో ఒక్క సారిగా కరెంట్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే మరణించాడు. అయితే అతడిని రక్షించేందుకు చందర్ నాయక్ ప్రయత్నించాడు. దీంతో ఆయనకు కరెంట్ షాక్ తగలడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటు వైపు వెళ్లిన ఇతర రైతులు వీరిని గమనించి, బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే రోజు ఇద్దరు రైతులు మరణించడంతో జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొంది.