తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఖమ్మం హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ తరలించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రైవేటు హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ఏఐజీ హాస్పిటల్‌లో తమ్మినేని వీరభద్రంను చేర్చినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి.
రెండు రోజులుగా ఆయన ఖమ్మంలోని ఉన్నారు. ఖమ్మంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 70 ఏళ్ల తమ్మినేని వీరభద్రం తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
undefined
Also Read: MP Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. ఎంపీ రఘురామ రియాక్షన్
ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఎక్కువగా మీడియాలో కనిపించారు. కాంగ్రెస్ తో పొత్తు విషయంపై పలుమార్లు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చివరి వరకు నాన్చుడు ధోరణి వహించిందని, కోరిన స్థానాలు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత సీపీఎం సొంతంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. తమ్మినేని వీరభద్రం మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇక సీపీఐ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తులోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.