ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు: తెలంగాణ గవర్నర్ తమిళిసైపై సీపీఐ ఫైర్

By narsimha lode  |  First Published Nov 10, 2022, 2:14 PM IST


తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ పై సీపీఐ  నేతలు మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్దంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. రాజ్ భవన్ ను  ముట్టడిస్తామని సీపీఐ  ప్రకటించింది.
 


హైదరాబాద్:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీరుపై సీపీఐ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని  సాంబశివరావులు గురువారంనాడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని నారాయణ చెప్పారు.తాము మాత్రం అంబేద్కర్ రాజ్యాంగం చదివినట్టుగా ఆయన చెప్పారు.వర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.బిల్లులపై మంత్రులు గవర్నర్ కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.అనుమానం ఉంటే గవర్నర్ అధికారులతో మాట్లాడుకోవాలన్నారు.బిల్లులను  ఎక్కువకాలం పెండింగ్ లో పెట్టాల్సిన అధికారం గవర్నర్ కు లేదన్నారు.గవర్నర్లతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందిపెడుతుందన్నారు.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థతో నష్టమే తప్ప లాభం లేదని ఆయన చెప్పారు.మునుగోడులో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ తో కలిసి పనిచేసినట్టుగా ఆయన  తెలిపారు.రాజకీయాల్లో శాశ్వత  మిత్రులు,శాశ్వత శత్రువులుండరని ఆయన చెప్పారు.

Latest Videos

also read:తెలంగాణ నుండి తమిళిసై వెళ్లిపోవాలి: సీపీఐ కార్యదర్శి కూనంనేని

ఇష్టం లేకపోతే బిల్లులను వెనక్కి పంపాలని ఆయన గవర్నర్ ను కోరారు.రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.గవర్నర్ వ్యవహరశైలిని నారాయణ తప్పుబట్టారు. గవర్నర్ తన  వైఖరిని మార్చుకోవాలన్నారు.తన ఫోన్ ట్యాపింగ్  జరుగుతుందేమోననే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అనుమానం వ్యక్తం చేయడం వెనుక  ఉద్దేశ్యం ఏమిటని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నిచారు..కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు.గవర్నర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన చెప్పారు.

click me!