ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్?.. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండేందుకేనా..?

By Sumanth KanukulaFirst Published Nov 10, 2022, 12:21 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కొన్ని రోజులు పాటు ఆయన అక్కడే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బీఆర్‌ఎస్‌తో పాటు, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ అంశాలపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం గానీ, ఎల్లుండి ఉదయం గానీ ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కొన్ని పాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్.. పలువురు విపక్ష పార్టీల నాయకులను కలవనున్నట్టుగా టీఆర్ఎస్ ‌వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది. 

అయితే ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు దూరంగా ఉండేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య సత్సబంధాలు దెబ్బతిన్న.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మూడుసార్లు ఇదే విధంగా జరిగింది. ఈ సారి కూడా కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారనే ప్రచారం సాగుతుంది. 

click me!