
హైదరాబాద్: Telangana రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి Narendra Modi చేసిన వ్యాఖ్యలపై CPI జాతీయ కార్యదర్శి Narayana మండిపడ్డారు.
రాష్ట్రపతి Ramnath kovind ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై Rajya Sabhaలో ప్రసంగించే సమయంలో తెలంగాణ విషయంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. Parliament తలుపులు మూసి బిల్లును పాస్ చేశారన్నారు. పార్లమెంట్ లో మైక్ లకు కూడా కట్ చేశారని ఆయన విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ లో ఈ బిల్లును బలవంతంగా ఆమోదింపజేశారని చేసిన వ్యాఖ్యలపై నారాయణ మండిపడ్డారు.ఆనాడు పార్లమెంట్ లో BJP పక్ష నేతగా సుష్మాస్వరాజ్ ఉన్నారని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా ఉన్నారని తెలిపారు. బలవంతంగా ఈ బిల్లులను ఆమోదింపజేస్తే ఎందుకు అడ్డుకోలేదని ఆయన అడిగారు. తెలంగాణ బిల్లు విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సహకరించిందన్నారు.
కానీ ఇవాళ మోడీ మాత్రం అందుకు విరుద్దంగా వ్యాఖ్యలు చేసి బీజేపీకి చెందిన నేతలను అవమానపర్చారన్నారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి Venkaiah Naidu లను కించపర్చుకొంటారా అని నారాయణ మోడీని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని నారాయణ సెటైర్లు వేశారు."
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు.
Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు.
మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు.