తెలంగాణపై మోడీ వ్యాఖ్యలు: దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని కాంగ్రెస్ పిలుపు

Published : Feb 08, 2022, 04:11 PM ISTUpdated : Feb 08, 2022, 04:18 PM IST
తెలంగాణపై మోడీ వ్యాఖ్యలు: దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని కాంగ్రెస్ పిలుపు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ విషయమై నిరసనకు దిగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని పిలుపునిచ్చింది.అనేక చర్చల తర్వతే రాష్ట్ర విభజన జరిగిందని కాంగ్రెస్ గుర్తు చేసింది. రాజకీయ లబ్ది కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. 

Rajya Sabhaలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి Ponnala Laxmaiah  మంగళవారం నాడు స్పందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ప్రధాని Narendra Modi వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని Congress  పార్టీయే ఇచ్చిందని బీజేపీ ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.

మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన BJP ఆ తర్వాత  జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు. ఈ విషయం మోడీకి గుర్తుకు లేదా అని ఆయన ప్రశ్నించారు.  దీపాలు వెలిగించి చప్పట్లు కొడితే corona పోయిందా అని ఆయన అడిగారు. ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన చెప్పారు.

రైతు రుణమాఫీ చేయడంతో పాటు పంటలకు మద్దతు ధర ఇచ్చిన చరిత్ర తమ పార్టీదని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీని తుక్డే తుక్డే పార్టీ అని మోడీ చెప్పడాన్ని పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేయడం మినహా సామాన్యులకు ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు. 

Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే  ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు. 

Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu