ఆర్టీసీ బస్సులో కోడిపుంజు.. రూ. 30 టికెట్ కొట్టిన కండక్టర్.. ఎక్కడంటే..

Published : Feb 08, 2022, 04:02 PM IST
ఆర్టీసీ బస్సులో కోడిపుంజు.. రూ. 30 టికెట్ కొట్టిన కండక్టర్.. ఎక్కడంటే..

సారాంశం

తెలంగాణ ఆర్టీసీ బస్సులో కోడికి టికెట్ కొట్టిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో ప్రయాణికుడు రూ. 30 చెల్లించి కోడిని వెంట పెట్టుకుని బస్సులో ప్రయాణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

తెలంగాణ ఆర్టీసీ బస్సులో కోడికి టికెట్ కొట్టిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తుంది. అయితే మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు కరీంనగర్ కు వెళ్లేందుకు వెంట తెచ్చుకున్న కోడిపుంజు తో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే అలీ వద్ద కోడి పుంజు ఉండటాన్ని గమనించిన బస్సు కండెక్టర్ దానికి కూడా టికెట్ కొట్టాడు. రూ. 30 రూపాయల టికెట్ కొట్టి.. డబ్బులు కట్టాలని చెప్పాడు. 

ఇదేమిటని అలీ అడిగితే ప్రాణం ఉన్న జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పాడు. దీంతో మహ్మద్ రూ. 30 చెల్లించి బస్సులో కోడిని వెంటబెట్టుకుని ప్రయాణించాడు. ప్రస్తుతం ఈ వార్త పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

కోడిపుంజుకి టికెట్ తీసుకోవడంపై బస్సు కండక్టర్ మాట్లాడుతూ.. గోదావరిఖని నుంచి ఓ ప్రయాణికుడు బుట్టలో పందెం కోడిని బుట్టలో తీసుకొచ్చాడని తెలిపారు. దానికి కూడా టికెట్టు కొట్టడం జరిగిందన్నారు. ప్రయాణికులతో పాటు జంతువులను గానీ, కోళ్లను గానీ తీసుకొస్తే టికెట్ కొడతామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్