కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ కోసమే.. షర్మిలతో పార్టీ: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 10, 2021, 7:21 PM IST
Highlights

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించి సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం... కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ గురించి సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీ పెట్టడం... కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు.

కార్పోరేట్లకు కొమ్ము కాసేందుకే కొత్త చట్టాలన్నారు నారాయణ. ఒడిశాలో సీపీఐ తన్ని తరిమేసిన సంస్థకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కట్టబెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రధానికి సీఎం లేఖ రాయడం ఒక నటన అని.. అఖిలపక్షంతో చర్చించి ఢిల్లీ వెళ్లి అందోళన చేపడదామని నారాయణ హెచ్చరించారు. గతంలో దివంగత వైఎస్ఆర్ కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లారని ఆయన గుర్తుచేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మితే ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు మొదటి ముద్దాయి కావడం తథ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగితేనే నాయకులు తయారయ్యేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రోత్సాహకం ప్రకటించకుంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దగ్గర అబద్దాలన్నీ అయిపోయాయని.. ఇప్పుడు మారువేషంలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు సెటైర్లు వేశారు.

పార్లమెంట్‌లో పట్టపగలు ప్రధాని మోడీ కన్నీరు పెట్టుకున్నారని.. అలా కన్నీరు కార్చే వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకే అజాద్‌కు కన్నీటి వీడ్కోల డ్రామా అంటూ నారాయణ వ్యాఖ్యానించారు. 

click me!