గొర్రెలు మింగారు.. రాబందులు, అప్పుడు నోరు విప్పలేదే: కాంగ్రెస్‌కు కేసీఆర్ చురకలు

By Siva KodatiFirst Published Feb 10, 2021, 5:58 PM IST
Highlights

దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని..నాడు కరెంట్ లేదు, ఎరువుల్లేవు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు

దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని..నాడు కరెంట్ లేదు, ఎరువుల్లేవు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతలకు ఇవ్వడం చేత కాలేదని.. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక వడ్డు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. ముత్యాల బ్రాంచ్ కెనాల్ 50 ఏళ్లలో ఎందుకు లైనింగ్ చేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

ఈ మొఖాలన్నీ నాడు ఏం చేశాయని సీఎం ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ చేసిన ఒక్కో కార్యక్రమం భారతదేశంలో ఎక్కడైనా వుందా..? కళ్యాణ లక్ష్మీ దేశంలో ఎక్కడైనా అమలవుతుందా అని కేసీఆర్ నిలదీశారు.

గతంలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఆఫీసుల్లోకి వెళ్తే లంచాలివ్వాలని.. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి అవినీతిని అరికట్టామన్నారు. కాంగ్రెస్‌ది దోపిడి రాజ్యం దొంగల రాజ్యమని.. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పునరుద్ఘాటించారు.

మీరు గొర్రెలు మింగారు.. మేం గొర్రెలు ఇస్తున్నామంటూ సెటైర్లు వేశారు. అనేక వృత్తి కులాలను పైకి తెచ్చే విధంగా చేస్తున్నామని.. రైతు బంధు కార్యక్రమం గురించి ఏనాడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా అని కేసీఆర్ ప్రశ్నించారు.

మీరు బంధువులు కాదు రాబందులు అని.. టీఆర్ఎస్ గవర్నమెంట్ క్లీన్ గవర్నమెంట్ అని సీఎం చెప్పారు. కాంగ్రెస్ నేతలు కూడా రైతు బంధు తీసుకుంటారని, మళ్లీ మాట్లాడతారని ఆయన ఎద్దేవా చేశారు. 

click me!