అత్తలకు కోడళ్లు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే.. మా పెన్షన్ వల్లే: హలియా సభలో కేసీఆర్

By Siva KodatiFirst Published Feb 10, 2021, 5:57 PM IST
Highlights

రైతుల్లో ఐకమత్యం రావాలని.. నేను కాపోన్నే అని అంగీకరించారు. గతంలో రైతులకు కూసుందామంటే జాగా దిక్కులేదని.. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్ఎస్సేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

రైతుల్లో ఐకమత్యం రావాలని.. నేను కాపోన్నే అని అంగీకరించారు. గతంలో రైతులకు కూసుందామంటే జాగా దిక్కులేదని.. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్ఎస్సేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రతి వూళ్లో వైకుంఠధామం కడుతున్నామని.. 3,400 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది టీఆర్ఎస్ అవునా..? కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లకు వింత వింత బీమారీలు వున్నాయని.. దామరచెర్లలో 4 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతోందని కేసీఆర్ తెలిపారు.

గాలిమాటలకు మోసపోవద్దని.. మంచి ప్రభుత్వాన్ని కాపాడుకుంటే బాగుపడతామని ఆయన చెప్పారు. తాను చెప్పే మాటల్లో ఏ ఒక్క అబద్ధమున్నా సాగర్‌లో టీఆర్ఎస్‌ను ఓడించాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

యాదాద్రి దివ్యక్షేత్రాన్ని ఎవరైనా పట్టించుకున్నారా..? ప్రపంచమే అబ్బురపోయేలా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. కేసీఆర్ వట్టి మాటలు చెప్పడని.. తెలంగాణను బంగారు తునక చేయాలని కష్టపడుతున్నామని స్పష్టం చేశారు.

కోడళ్లు అత్తలకు ఇప్పుడు గౌరవమిస్తున్నారంటే మేం ఇస్తున్న పెన్షన్ కారణం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయకుంటే ఓట్లు అడగం అని చెప్పాలంటే ఎంత ధైర్యముండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఏ నాయకుడైనా ఇలా చెప్పారా.. రాజకీయ గుంట నక్కలను చూసి మోసపోవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

click me!