దుబ్బాక బైపోల్: తటస్థంగా ఉండాలని సీపీఐ నిర్ణయం, కానీ ట్విస్ట్ ఇదీ...

By narsimha lodeFirst Published Oct 28, 2020, 12:25 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని సీపీఐ  నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని ఆ పార్టీ బుధవారం నాడు ప్రకటించింది.
 


వరంగల్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని సీపీఐ  నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని ఆ పార్టీ బుధవారం నాడు ప్రకటించింది.

also read:కేసీఆర్, చాడ వెంకట్ రెడ్డి భేటీ వెనుక అంతర్యం ఇదేనా?

వచ్చే నెల 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున సోలిపేల సుజాత, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచాడు. బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీలో నిలిచారు.

also read:ఆ డబ్బులతో నాకేం సంబంధం: రఘునందన్ రావు

ఈ ఎన్నికల్లో సీపీఐ పోటీకి దూరంగా ఉంది.ఈ నియోజకవర్గంలో సీపీఐకి  ఓట్ బ్యాంకు ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడ మద్దతును సీపీఐ ప్రకటించలేదు. తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీఐ తెలిపింది.

అయితే సీపీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని  సీపీఐ దుబ్బాక ఓటర్లను కోరింది.

గత మాసంలో  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రెవిన్యూ బిల్లు గురించి చర్చించేందుకు ఈ భేటీ జరిగినట్టుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సీఎం ప్రకటించారు. 

అయితే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల గురించి కూడ చర్చ జరిగే అవకాశం లేకపోలేదని అప్పట్లో చర్చ సాగింది. కానీ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో తటస్థంగా ఉండాలని సీపీఐ నిర్ణయం తీసుకొంది.
 

click me!