లాక్‌డౌన్ ఎఫెక్ట్: పురుగుల మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య

By narsimha lode  |  First Published May 17, 2020, 10:18 AM IST

ఆర్దిక సమస్యలతో పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆదివారం నాడు ఉదయం మృతి చెందారు. 
 


వరంగల్: ఆర్దిక సమస్యలతో పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆదివారం నాడు ఉదయం మృతి చెందారు. 

వరంగల్ జిల్లాలోని రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో ఈ ఘటన చోటు చేసుకొంది. వాంకుడోత్ హేమ్లా అతని భార్య తులసి ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ శుక్రవారంనాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 

Latest Videos

వీరిని గమనించిన స్థానికులు వృద్ధ దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఉదయం మరణించారు.
మృతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు

also read:తెలంగాణపై కరోనా పంజా... ఒకే అపార్ట్ మెంట్ లో 23మందికి, మొత్తం 55 కేసులు

వీరందరికి పెళ్లిళ్లు కూడ అయ్యాయి.  ఈ దంపతుల ఇద్దరు కొడుకులు మానసిక వికలాంగులు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో ఆర్ధికంగా ఈ కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. దీంతో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తెలంగాణలో  ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. 
 

click me!