హైదరాబాదులో దారుణం: కిడ్నాప్ నుంచి బయటపడిన చిన్నారికి కరోనా

By telugu teamFirst Published May 17, 2020, 7:20 AM IST
Highlights

అపహరణకు గురైన 18 నెలల మగశిశువుకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తల్లితో పడుకున్న బాలుడిని ఓ వ్యక్తిని హైదరాబాదులో ఎత్తుకెళ్లాడు. ఆ బాలుడిని పోలీసులు రక్షించారు.

హైదరాబాద్: అపహరణ నుంచి బయటపడిన 18 నెలల చిన్నారికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కిడ్నాపైన చిన్నారిని హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు రక్షించారు. ఆ పిల్లాడి తల్లి మద్యానికి బానిస. దాంతో పిల్లాడిని సరిగా చూసుకోలేదనే ఉద్దేశంతో పోలీసులు శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. 

ఆ బాలుడితో 22 మంది కాంటాక్టులోకి వచ్చారు. వారిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. తన కుమారుడు కనిపించడం లేదని 22 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను నిద్రిస్తున్న సమయంలో కనిపించకుండా పోయినట్లు చెప్పింది. 

సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ప్రధాన అనుమానితుడిని 27 ఏళ్ల ఇబ్రహీంగా గుర్తించారు. పండ్లు ఇస్తానని బుజ్జగించి అతన్ని ఇబ్రహీం తన టూవీలర్ పై తీసుకుని వెళ్లాడు. తన భార్యకు జన్మించిన మగపిల్లలంతా మరణించడంతో మగ పిల్లాడు కావాలనే ఉద్దేశంతో ఆ బాలుడిని అతను కిడ్నాప్ చేసినట్లు తేలింది. 

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లికి అప్పగించారు. బాలుడి తల్లి మద్యానికి బానిస అయినట్లు గుర్తించారు. బాలుడిని శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన కుటుంబాన్ని, పోలీసులను, ఇద్దరు జర్నలిస్టులను క్వారంటైన్ కు తరలించారు.

click me!