ఆస్పత్రిలో దంపతుల ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి...

Published : Mar 13, 2021, 12:09 PM ISTUpdated : Mar 13, 2021, 12:14 PM IST
ఆస్పత్రిలో దంపతుల ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి...

సారాంశం

ఇటీవల సాయి లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో... ఆమెను చికిత్స నిమత్తం రాజ్ భవన్ క్వార్టర్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

దంపతులు ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. ఆస్పత్రి పక్క బెడ్ మీద సూసైడ్ నోట్ పెట్టి మరీ వీరు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రహమత్ నగర్ ప్రాంతానికి చెందిన సుబ్బారావు కారు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య సాయి లక్ష్మి గృహిణని. కాగా... ఇటీవల సాయి లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో... ఆమెను చికిత్స నిమత్తం రాజ్ భవన్ క్వార్టర్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య కి తోడుగా  పక్కనే సుబ్బారావు కూడా అక్కడే ఉన్నాడు.

ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివసించే వీరి కూతురు ఎన్‌.శివాణికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఆమె ఉదయం 4:30 గంటల లోపు అక్కడకు వచ్చి చూసే సరికి తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా తల్లి అప్పటికే మృతి చెందింది. 

ఇక, సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు కూడా శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి బెడ్‌ పక్కనే సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఆస్పత్రి సిబ్బందికి తన చావుకు ఎలాంటి సంబంధం లేదు. మానసిక వ్యధతో చనిపోతున్నాను. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే తమ దహన సంస్కారాలు చేయాలని రాసి ఉంది. కాగా అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సెక్షన్‌–174, 309 ఐపీసీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్