కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: కిలో టమాట 100 రూపాయలు!

By Sree sFirst Published Mar 23, 2020, 1:03 PM IST
Highlights

ఒక్క రోజు జనతా కర్ఫ్యూ అని వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలంతా రేపటి నుండి షాపులు ఉండకపోతే పరిస్థితేమిటని బయటకెళ్ళి మార్కెట్ల మీద పడి కొనడం మొదలుపెట్టారు. 

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికి[పోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! జనతా కర్ఫ్యూ తోపాటుగా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా వైద్య సేవలందిస్తున్న వారందరికీ, ప్రజల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి థాంక్స్ చెప్పడానికి అందరిని బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలుపమని చెప్పారు. 

Photos: కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలా చప్పట్లు కొట్టి అందరికి థాంక్స్ చెప్పి తెలంగాణలో లాక్ డౌన్ ని మరో వారం రోజులపాటు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయన నిత్యావసరాలు మాత్రం దొరుకుతాయని అన్నారు. మార్కెట్లు షాపులు తెరిచి ఉంటాయని చెప్పారు. 

ఆయన ఇలా రోజు తెరిచి ఉంటాయని చెప్పినప్పటికీ... ఒక్క రోజు జనతా కర్ఫ్యూ అని వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలంతా రేపటి నుండి షాపులు ఉండకపోతే పరిస్థితేమిటని బయటకెళ్ళి మార్కెట్ల మీద పడి కొనడం మొదలుపెట్టారు. 

ఒక్కసారిగా జనాలు రావడం, స్టాక్ అయిపోతుండడంతో రైతు బజార్ లోని వ్యాపారస్తులు కూడా రేట్లు పెంచేశారు. వారికి కూడా ట్రాన్స్పోర్టు ఇబ్బంది ఉంది. అందువల్ల రేట్లు పెరిగి ఉండొచ్చు. 

కానీ కిలో టమాటాను 100 రూపాయలకు అమ్మెంత రీతిలో అయితే కాదు కదా! టమాటో ఒక్కటే కాదు మిర్చి కూడా 80 నిరూపాయలుంది. రైతు బజార్లో అలా ఉంది. అదే రిటైల్ మార్కెట్లలో మిర్చిని 230 రూపాయలకు ఒక కిలో అమ్ముతున్నారు. 55 రూపాయలకు పావు కేజీ ఇస్తున్నారు. ఇది బయట పరిస్థితి. 

క్యారట్, కాప్సికం లు కూడా 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఎవరు ఎక్కువగా కొనని కాకరకాయ కూడా 90 రూపాయల రేటు పలుకుతుంది. ఇది కేవలం ఒక్క హైద్రాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. 

Also Read: తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే...

ప్రజలంతా తాము కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం మాత్రం ఈ రేట్లను తగ్గేలా చూసి ఈ రేట్లను అదుపు చేయాలనీ కోరుతున్నారు. ఇలానే గనుక రేట్లు ఉంటె... ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలు కనీసం కూరగాయలు కొనుక్కోవడానికి కూడా సరిపోవని పెద్ద, దిగువ మధ్యతరగతివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

click me!