ఒక్క రోజే ముగ్గురికి కరోనా పాజిటివ్: తెలంగాణలో 30కి చేరిన సంఖ్య

Published : Mar 23, 2020, 12:58 PM ISTUpdated : Mar 23, 2020, 02:28 PM IST
ఒక్క రోజే ముగ్గురికి కరోనా పాజిటివ్: తెలంగాణలో 30కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. తాజాగా సోమవారం ఒక్క రోజే మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. లండన్, ఫ్రాన్స్ ల నుంచి వచ్చిన ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య 30కి చేరుకుంది. సోమవారం ఒక్కరోజే ముగ్గురు కరోనా పాజిటివ్ కు గురైనట్లు తేలింది. లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అలాగే, ఫ్రాన్స్ నుంచి వచ్చి 21 ఏళ్ల యువకుడు కరోనా వైరస్ బారిన పడ్డాడు. అలాగే, కరీంనగర్ లో ఇండోనేషియా పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికి కరోనా సేకింది.

ఇటీవల ఇండోనేషియా నుంచి ఓ బృందం కరీంనగర్ వచ్చింది. వారితో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. అతన్ని కరీంనగర్ నుంచి సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనితో కలిసి తిరిగినవారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. 

Photos: కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ

ఇళ్లలోంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇండోనేషియా నుంచి ఇటీవల 11 మంది మతప్రచారకులు వచ్చారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

వారంతా క్రాంతి సంపర్క్ రైలులో రామగుండం చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఆటోలో కరీంనగర్ చేరుకున్నారు. దాంతో కరీంనగర్ లో తీవ్ర కలకలం చెలరేగింది. ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. 

Also Read: తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే...

ఆ పరిస్థితుల్లో కరీంనగర్ లో ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. ఇంటింటికీ వైద్యం బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. రంగంలోకి 100 వైద్య బృందాలు దిగాయి.

PREV
click me!

Recommended Stories

Kabaddi Match: స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి కబడ్డీ ఆటకు రేవంత్ రెడ్డి ఫిదా | Asianet News Telugu
అసెంబ్లీలో అసభ్యకర ప్రవర్తన..పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు Revanth Reddy Demand | Asianet News Telugu