తెలంగాణలో కరోనా ఉధృతి: కొత్తగా 1811 పాజిటివ్ కేసులు, 9 మంది మృతి

Published : Oct 10, 2020, 09:38 AM ISTUpdated : Oct 10, 2020, 10:51 AM IST
తెలంగాణలో కరోనా ఉధృతి: కొత్తగా 1811 పాజిటివ్ కేసులు, 9 మంది మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్ష 10 వేల మార్కును దాటింది. తాజాగా తెలంగాణలో కరోనాతో 9 మంది మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1811 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్ష 10 వేల 346కు చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1217కు చేరుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 35 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

హైదరాబాదులో కొత్తగా 291 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో 100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 29
భద్రాద్రి కొత్తగూడెం 81
జిహెచ్ఎంసీ 291
జగిత్యాల 30
జనగామ 31
జయశంకర్ భూపాలపల్లి 2
జోగులాంబ గద్వాల 25
కామారెడ్డి 33
కరీంనగర్ 100
ఖమ్మం 75
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 11
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 33
మంచిర్యాల 21
మెదక్ 24
మేడ్చెల్ మల్కాజిగిరి 171
ములుగు 26
నాగర్ కర్నూలు 27
నల్లగొండ 108
నారాయణపేట 14
నిర్మల్ 32
నిజామాబాద్ 35
పెద్దపల్లి 34
రాజన్న సిరిసిల్ల 30
రంగారెడ్డి 138
సంగారెడ్డి 45
సిద్ధిపేట 63
సూర్యాపేట 71
వికారాబాద్ 27
వనపర్తి 35
వరంగల్ రూరల్ 32
వరంగల్ అర్బన్ 62
యాదాద్రి భువనగిరి 33

 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్