తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Published : Sep 10, 2020, 09:22 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: లక్షా 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు

సారాంశం

హైదరాబాదులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం పెరుగుతూనే ఉంది. తెలంగాణ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేల మార్కు దాటింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. హైదరాబాదులో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తున్నప్పటికీ మొత్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 2534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేల 176కు చేరుకుంది. 

గత 24 గంటల్లో తెలంగాణ కరోనా కారణంగా 11 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 927కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి తెలంగాణ 2071 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా లక్షా 71 వేల 143కు చేరుకుంది. ఇంకా 32106 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వరుసగా నాలుగో రోజు హైదరాబాదులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400కు దిగువన నమోదయ్యాయి. గత 24 గంటల్లో హైదరాబాదులో 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ విధంగా ఉంది.

ఆదిలాబాద్ 23
భద్రాద్రి కొత్తగూడెం 81
జిహెచ్ఎంసి 327
జగిత్యాల 65
జనగామ 41
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంబ గద్వాల 29
కామారెడ్డి 123
కరీంనగర్ 107
ఖమ్మం 109
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 30
మహబూబ్ నగర్ 38
మహబూబాబాద్ 73
మంచిర్యాల 64
మెదక్ 42
మేడ్చెల్ మల్కాజిగిరి 132
ములుగు 16
నాగర్ కర్నూలు 62
నల్లగొండ 149
నారాయణపేట 16
నిర్మల్ 25
నిజామాబాద్ 90
పెద్దపల్లి 58
రాజన్న సిరిసిల్ల 47
రంగారెడ్డి 195
సంగారెడ్డి 96
సిద్ధిపేట 103
సూర్యాపేట 83
వికారాబాద్ 22
వనపర్తి 42
వరంగల్ రూరల్ 41
వరంగల్ అర్బన్ 124
యాదాద్రి భువనగిరి 57

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu