మేనత్తను బండరాయితో మోది హత్య, డబ్బుతో పరార్

By telugu news teamFirst Published Sep 10, 2020, 8:38 AM IST
Highlights

ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా, కుమారుడు నిఖిల్‌ హన్మకొండలో ఇంటర్‌ చదువుతున్నాడు. శారద అన్న కుమారుడు ఆకాశ్‌బాబు తరుచూ ఆమె వద్దకు వస్తుండేవాడు. ఇంట్లో తిరుగుతూ డబ్బులు, బంగారం ఎక్కడ పెడుతున్నారో చూస్తుండేవాడు. 

ఆమె అతనికి సొంత మేనత్త. ఆమె కూరగాయలు అమ్ముతూ.. నానా కష్టాలు పడుతూ కూతురి పెళ్లి కోసం రూపాయి రూపాయి కూడపెట్టింది. ఆ డబ్బుతో కూతురికి సొంత బంగారం కూడా చేయించింది. కాగా.. ఆమె కష్టార్జితంపై మేనల్లుడి కన్నుపడింది. మద్యానికి బానిసగా మారిన అతను.. అత్తింట్లోని బంగారు నగలు, డబ్బు కాజేయాలని అనుకున్నాడు. అందుకు తగినట్లు ప్లాన్ వేసిన అతను.. ర్ధరాత్రి దాటాక మేనత్త ఇంట్లోకి అతడు ప్రవేశించాడు. నిద్రిస్తున్న మేనత్తతో పాటు ఆమె కొడుకుని బండరాయితో బాది, డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు. ఈ దారుణ సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హన్మకొండకు చెందిన శారద(38) అనే మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా, కుమారుడు నిఖిల్‌ హన్మకొండలో ఇంటర్‌ చదువుతున్నాడు. శారద అన్న కుమారుడు ఆకాశ్‌బాబు తరుచూ ఆమె వద్దకు వస్తుండేవాడు. ఇంట్లో తిరుగుతూ డబ్బులు, బంగారం ఎక్కడ పెడుతున్నారో చూస్తుండేవాడు. 

శారద తన కుమార్తె వివాహం కోసం డబ్బులు పోగుచేసి బీరువాలో భద్రపర్చడాన్ని గమనించాడు. ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున ఆమెతో పాటు ఆమె, కుమారుడిపై దాడి చేశాడు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదు, 5 తులాల బంగారం, 3 సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో శారద మృతి చెందగా నిఖిల్‌ ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. 

చోరీ చేసిన డబ్బు, నగలతో హన్మకొండ వినాయకనగర్‌లో ఉన్న తన స్నేహితులు మేకల మచ్చేందర్‌, ఓ బాలుడి వద్దకు వెళ్లి ఆశ్రయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి డబ్బులతో హైదరాబాద్‌కు వెళ్లి జల్సా చేశారు. మంగళవారం రాత్రి హన్మకొండకు వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోని తీసుకుని విచారించారు. చేసిన తప్పును ఒప్పుకోవడంతో వారి నుంచి రూ. 2.71 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బాలుడిని బోస్టన్‌ జైలుకు.. అకాశ్‌, మచ్చేందర్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

click me!