నిన్నొక్కరోజే తెలంగాణలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్యా 532కి చేరింది. ప్రస్థులంతా ఆక్టివ్ కేసులు 412 గా ఉండగా ఇప్పటివరకు 103 మందిని డిశ్చార్జ్ చేసారు. నిన్నటి రెండు మరణాలతో కలుపుకొని తెలంగాణాలో మరణాల సంఖ్య 16కు చేరుకుంది.
తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా తాజాగా ఇద్దరు మరణించారు. ఈ ఇద్దరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 16 మంది మరణించినట్టు అయింది. మరణాలు ఇలా ఉండగా, మరోవైపు తెలంగాణలో కరోనా మహమ్మారి బారినుంచి కోలుకొని బయటపడుతున్నవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది. ఏడుగురికి నిన్న కరోనా నెగటివ్ రిజల్ట్స్ రావడంతో వారు పూర్తిగా కోలుకున్నారు అని ధృవీకరించుకున్న తరువాత డిశ్చార్జ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
నిన్నొక్కరోజే తెలంగాణలో 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్యా 532కి చేరింది. ప్రస్థులంతా ఆక్టివ్ కేసులు 412 గా ఉండగా ఇప్పటివరకు 103 మందిని డిశ్చార్జ్ చేసారు. నిన్నటి రెండు మరణాలతో కలుపుకొని తెలంగాణాలో మరణాల సంఖ్య 16కు చేరుకుంది.
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన 24 గంటల్లో 34 మంది మరణించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 8,356కి చేరగా, మరణాల సంఖ్య 273కి చేరిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు.
Also Read:ముంబై తాజ్‌హోటల్‌లో ఆరుగురికి కరోనా: ఉద్యోగుల్లో ఆందోళన
ఇప్పటి వరకు 716 మంది కరోనా నుంచి బయటపడ్డారని, మార్చి 29 నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 979 కాగా..ప్రస్తుతం ఆ సంఖ్య వేగంగా దూసుకెళ్తోందని లవ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేసులకు తగ్గట్టుగానే దానిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 9 నాటికి 1,100 పడకల బెడ్లు అవసరమైతే తాము 85 వేల పడకలు సిద్ధం చేశామని... నేడు 1,671 పడకలు అవసరమైతే 601 ఆసుపత్రుల్లో లక్షా 5 వేల పడకలు సిద్ధం చేశామని లవ్ అగర్వాల్ చెప్పారు.
దేశంలో 151 ప్రభుత్వ, 68 ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ ముర్కేకర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1,86,906 మంది శాంపీళ్లను పరీక్షించినట్లు మనోజ్ చెప్పారు.
Also Read:కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం
గత ఐదురోజులుగా రోజుకు సగటున 15,747 శాంపిళ్లను పరీక్షిస్తుండగా.. అందులో 584 కేసులు పాజిటివ్‌గా తేలుతున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి 40 వ్యాక్సిన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని... అవేవీ తదుపరి దశకు చేరుకోలేదని మనోజ్ పేర్కొన్నారు.
దీంతో ఈ వైరస్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చినట్లు ముర్కేకర్ పేర్కొన్నారు.