కరోనా కంట్రో‌ల్‌లోనే, భయం వద్దు: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్

By narsimha lodeFirst Published May 5, 2021, 3:00 PM IST
Highlights

రాష్ట్రంలో ఆక్సిజన్ , ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. 
 ఆయన చెప్పారు. 

హైదరాబాద్:రాష్ట్రంలో ఆక్సిజన్ , ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.  బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోనే ఉందన్నారు. కరోనా వచ్చినా కూడ సీఎం కేసీఆర్ రోజూ నాలుగైదు సార్లు తనతో ఈ విషయమై మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. 

also read:వీకేండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలి, నైట్ కర్ఫ్యూ టైమ్ పెంచాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో  కరోనాను నియంత్రించేందుకు ఎంత ఖర్చైనా చేసేందుకు వెనుకాడవద్దని  సీఎం తనకు చెప్పారన్నారు. కరోనా విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుండి నిరంతరాయంగా పనిచేస్తోందన్నారు. ఈ కారణంగానే  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కంట్రోల్ లో ఉందన్నారు.  రోజుకు 33 ఎయిర్ అంబులెన్స్ లు హైద్రాబాద్ కు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ట్రెండ్స్ చూస్తుంటే కరోనా కేసులు తగ్గుతున్నాయని ఆయన వివరించారు. 

త్వరలోనే ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా సీఎస్ తెలిపారు.  టెస్టుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్రానికి కిట్స్ పెంచామన్నారు.రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవని పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిర్వహణపై కూడ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. 
 

click me!